బాబు మ‌ళ్లీ యూ ట‌ర్న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 11:30:46

బాబు మ‌ళ్లీ యూ ట‌ర్న్

నిజాలు వాస్త‌వాలు క‌ప్పిపుచ్చ‌డం తెలుగుదేశానికి బాగా అల‌వాటైన ప‌ని.. అందుకే ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో న‌మ్మినా ఇప్పుడు వాస్త‌వాల‌ను సైతం న‌మ్మడం లేద‌ని తెలుగుదేశం నాయ‌కులు కొంద‌రు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఎన్నిక‌లకు ముందు ప్ర‌త్యేక హూదా 15 సంవ‌త్స‌రాలు కావాలి అని అడిగిన చంద్రబాబు, మ‌ళ్లీ ప్ర‌త్యేక హూదా ఏమైనా సంజీవ‌నా అన్నారు.. ఇటు జ‌గ‌న్ ప్ర‌త్యేక హూదా పై గ‌ళం విప్ప‌డంతో స్పెష‌ల్ స్టేటస్ కావాలి కేంద్రం ఇవ్వాలి అంటున్నారు.. ఈ ధోర‌ణి పై ప్ర‌జ‌లు కూడా ఏమీ అర్ధం కాని స్దితిలో ఉన్నారు.
 
అయితే ప్ర‌త్యేక హూదా గురించి గ‌తంలో మాట్లాడిన స‌మ‌యంలో, హూదా వ‌ల్ల ఏమీ రావు పోల‌వ‌రానికి నిధులు వ‌స్తాయా కేంద్రం ఏపీకి ఎటువంటి సాయ‌మైనా చేస్తుందా అన్న రీతిలో ఆయ‌న మాట్లాడారు... కొంద‌రు ప్ర‌త్యేక హూదా వ‌ల్ల అనేకం  జ‌రుగుతాయి అని అంటున్నారు అని.. ఇది వాస్త‌వం కాదు అని అన్నారు ఆయ‌న‌. మ‌ళ్లీ తాజాగా ఆయ‌న యూటర్న్ తీసుకున్నారు ప్ర‌త్యేక హూదాపై... ఇది మ‌నకు హ‌క్కుగా అడుగుతున్నాం, ఇతర రాష్ట్రాల‌కు ఇస్తున్న‌ప్పుడు మ‌న‌కు ఎందుకు ఇవ్వ‌రు అనేది నా ప్ర‌శ్న అని అన్నారు చంద్ర‌బాబు.
 
బాబు ఇన్ని షేడ్స్ లో మాట్లాడ‌టం పై విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. ముందు 15 సంవ‌త్సరాలు కావాలి అని అడిగారు, కేంద్రంలో పోరాడి అన్ని సాధిస్తా అన్నారు.. చివ‌రకు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కూడా లేకుండా పోయింది. హూదా సంజీవ‌ని అన్నారు, అది వ‌స్తే ఏపీ అభివృద్ది ప‌రుగులు తీస్తుంది అన్నారు.. ఏదీ లేదు అస‌లు ప్ర‌త్యేక హూదా ఏపీకి రాదు, ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తాం అంటే వెంట‌నే అర్ధ‌రాత్రి స‌మావేశం పెట్టి ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తించారు.. ఇప్పుడు జ‌గ‌న్ తాజాగా ప్ర‌త్యేక హూదా కోసం ఉద్య‌మం తీసుకువ‌స్తుంటే మాట మార్చి మ‌న‌కు ప్ర‌త్యేక హూదా అవ‌స‌రం అనే మాట అందుకున్నారు.. మొత్తానికి ప్ర‌త్యేక హూదా కావాలి- ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలి అని బాబు కోరుకుంటున్న‌ట్లు ఉంది అని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.