వైసీపీ త‌ర‌పున ఆ నాయ‌కుడు గెలుపు త‌థ్యం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

guntur  ysrcp mp candidate fixed
Updated:  2018-03-02 03:37:16

వైసీపీ త‌ర‌పున ఆ నాయ‌కుడు గెలుపు త‌థ్యం ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ల పై కూడా ఇటీవల ఫోక‌స్ చేసింది అనే చెప్పాలి.. అమ‌రావ‌తి ప్రాంతంలో రాజ‌కీయంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో విజ‌యావ‌కాశాల కోసం ఇరు పార్టీలు రెడీ అవుతున్నాయి.. ఇటు వైసీపీ అటు తెలుగుదేశం ఎంపీ స్ధానాలు -ఎమ్మెల్యే స్ధానాలు... మెజార్టీ ఈ రెండు జిల్లాల్లో గెల‌వాలి అనే వ్యూహా ప్ర‌తివ్యూహాలు సిద్దం చేస్తున్నాయి.
 
ఇక గుంటూరు లోక్ స‌భ స్దానం ఈ విష‌యంలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.. ఆంధ్రాలో 25 పార్లమెంట్ల సెగ్మెంట్లు ఉన్నాయి ..గ‌త ఎన్నిక‌ల్లో మెజార్టీ తెలుగుదేశం గెలుచుకోగా, వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు పార్టీ ఫిరాయించారు. అయితే గుంటూరు ఎంపీ సెగ్మెంట్ పై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ నుంచి తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఉన్నారు.. అయితే ఆయ‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఉంటారు అని తెలుస్తోంది.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇక ఆయ‌న పై పోటికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్దిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు.. ఈ యువ‌నాయ‌కుడికి జ‌గ‌న్ సీట్ క‌న్ఫామ్ చేశారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.
         
ఇక గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేష్ అభిమానులు కూడా గ‌ల్లాకు మ‌ద్ద‌తు తెలిపారు.. సామాజిక‌వ‌ర్గం కూడా గ‌ల్లాకు ప్ల‌స్ అయింది. తొలిసారే ఆయ‌న స‌క్సెస్ అందుకుని హ‌స్తిన రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు..ఇటు చిత్తూరులో గ‌ల్లా అరుణ కుమారి కుటుంబానికి  రాజ‌కీయంగా పేరు ఉన్నా, ఆయ‌న‌కు చంద్ర‌బాబు చిత్తూరు నుంచి ఇవ్వ‌కుండా గుంటూరు నుంచి సీటు ఇచ్చారు... ముఖ్యంగా ఆర్ధికంగా బ‌ల‌మైన వ్య‌క్తిగా గ‌ల్లా ఉండ‌టం గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ల‌స్ అయింది.
 
ఇక చంద్రబాబు -మోదీ -ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే త్ర‌యం గుంటూరు లో ఓ ప్ర‌భంజ‌నంలా ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డింది.. ఇంట‌ర్నేష‌నల్ కంపెనీలు గుంటూరు - అమ‌రావ‌తి కేంద్రంగా ఆయ‌న ఎంపీ అయితే త‌ర‌లివ‌స్తాయి అని భావించారు. చివ‌ర‌కు డొమిస్టిక్ కంపెనీలకు  కూడా దిక్కులేకుండా పోయింది అమ‌రావ‌తిలో . ఇక గ‌ల్లా పై ఇక్క‌డ అభివృద్ది చేసింది ఏమీ లేదు అనే విమర్శ కూడా ఉంది. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నికల్లో  రాజ‌కీయంగా ఒడిదుడుకులు పాల‌వుతారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున విజ్ఞాన్ విద్యాసంస్ధల యజమానిగా ప్రముఖుడైన లావు రత్తయ్య మనవడు లావు శ్రీకృష్ణ దేవరాయులు గుంటూరు ఎంపీగా పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు... ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న చురుకుగా పాల్గొంటున్నారు... వైసీపీ పిలుపు ఇచ్చిన అన్ని కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాత్ర విశేషంగా ఉంటోంది... ఇక ఆర్దికంగా ప‌రిపుష్టంగా ఉంట‌డం ఆయ‌నకు క‌లిసి వ‌చ్చే అంశంగా క‌నిపిస్తోంది. ఇటు గ‌ల్లా జ‌య‌దేవ్ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇరువురు క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం ఇక్క‌డ ఇరువురికి పోటా పోటీగా ఉండే అంశంగా కనిపిస్తున్నాయి.
 
అయితే ఇటు గ‌ల్లా అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ది చేయ‌లేదు అనే విమ‌ర్శ ఎదుర్కొంటున్నారు.. ఇటు వైసీపీ త‌ర‌పున ఆయ‌న మొద‌టిసారి రాజ‌కీయాల్లో పోటికి నిలుచుంటున్నారు.. దీంతో విమ‌ర్శ‌లు చేయ‌డానికి శ్రీకృష్ణ పై ఎటువంటి అవ‌కాశం గ‌ల్లా కోట‌రీకి లేదు... స్ధానికంగా మంచి పేరు విద్యాసంస్ద‌ల గుర్తింపు  క‌లిగిన కుటుంబం కావ‌డంతో, ఇక్క‌డ ఆయ‌న‌కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి అంటున్నారు గుంటూరు ప్ర‌జ‌లు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.