వైసీపీకి ఆ ఐదు సీట్లు ఈ సారి మెజార్టీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:48:42

వైసీపీకి ఆ ఐదు సీట్లు ఈ సారి మెజార్టీ ?

ఓప‌క్క వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనేస్తున్నాం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేస్తున్నాం ఇదే ప్ర‌చారం తెలుగుదేశం చేసుకుంటూ ముందుకు పోతోంది.. మ‌రో ప‌క్క ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌తో జ‌గ‌న్ రాజ‌కీయంగా ప్ర‌జాక్షేత్రంలో ఉన్నారు..అయితే ఇటు రాజ‌కీయంగా జ‌గ‌న్ పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళుతుంటే, ఇచ్చిన హామీలు తీర్చ‌లేద‌ని ఎక్క‌డిక‌క్క‌డ వ్య‌తిరేక‌త తెలుగుదేశం పై చూపిస్తున్నారు ప్ర‌జ‌లు.

తాజాగా విడుద‌లైన నేష‌న‌ల్ మీడియా స‌ర్వే ఇటు వైసీపికి జోష్ పెంచింది.. ఇదేదే బాబు వ్య‌తిరేక మీడియా ఇచ్చింది కాదు, స్టాంప్ వేయించుకున్న అనుకూల మీడియా అస‌లే కాదు, అందుకే తెలుగుదేశం నాయ‌కులు కూడా ఈ విష‌యం పై నిశ్శ‌బ్దం వ‌హిస్తున్నారు.. రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే బాబుకు కాస్త ద‌డ పుట్టించింది అనేది తెలుగుదేశం నాయ‌కుల  మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ.. క‌రెక్ట్ ,వాస్త‌వాలు కానివి అర్ణబ్ గోస్వామి తెర‌పైకి తీసుకురారు అనేది దేశం అంతా తెల‌సిందే.. పైగా ఇదేదో డ్యాష్ బోర్డుకు కూడా అంతుచిక్క‌ని సర్వేఫ‌లితంగా తేలిపోతోంది.

12 ఎంపీ స్ధానాలు మాత్ర‌మే గెలుచుకుంటుంది బీజేపీ తెలుగుదేశం కూట‌మి ఇది ఆ వార్తా స‌ర్వే సారాంశం.. ఓట‌మి చెందే   ఐదు ఎంపీ స్ధానాలు కూడా తాజాగా బ‌య‌ట చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.. ఇటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ఐదు ఎంపీ స్ధానాల‌కు గాను కేవ‌లం రెండు  స్ధానాలు మాత్ర‌మే ఆ కూట‌మి  గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని, అలాగే  అనంత‌పురం జిల్లాలో ఒక‌టి, గుంటూరు జిల్లాలో మ‌రో ఎంపీ స్ధానం తెలుగుదేశానికి ఈ సారి అప‌జ‌యం అని చ‌ర్చించుకుంటున్నారు

మ‌రీ ముఖ్యంగా న‌ర‌సాపురం ఏలూరు ఎంపీ స్ధానాలు వైసీపీ గెలుచుకునే అవ‌కాశం ఉంది. ఇటు కాకినాడ రాజ‌మండ్రి అమ‌లాపురంలో రాజ‌మండ్రి మిన‌హా మిగిలిన రెండు ఎంపీ స్ధానాల్లో తెలుగుదేశం వైసీపీ మ‌ధ్య ట‌ఫ్ వార్ జ‌రుగ‌నుంది...ఒక‌వేళ ఇటు ఉండ‌వ‌ల్లి రాజ‌మండ్రి నుంచి వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తే, విజ‌యం వైసీపీకి వ‌రిస్తుంది అని నాయ‌కులు అంటున్నారు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.