బాబుకి బీజేపీ 10 ప్రశ్నలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 04:44:47

బాబుకి బీజేపీ 10 ప్రశ్నలు

అధికారం కోసం 600 తప్పుడు హామీలను ఇచ్చి, నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బీజేపీపైన విమర్శలు చేయడం విడ్డురంగా  ఉందని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు...నాలుగేళ్లు బీజేపీతో మిత్ర పక్షంగా ఉండి, ఇప్పుడు స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీపైన విమర్శలు చేయడం తగదని అన్నారు...
 
ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టి ఇప్పుడు యూ - టర్న్ తీసుకోని ప్రత్యేక హోదా అనడంతో మరోసారి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మొదలుపెట్టారని అన్నారు బీజేపీ నాయకులు...రాజధాని అమరావతి నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు ఇస్తే, వాటిని సద్వినియోగం చేసుకోకుండా తాత్కాలిక భవనాలు పేరుతో కోట్ల రూపాయలు పక్కదారి మల్లించింది నిజం కాదా అని మండిపడ్డారు ఏపీ బీజేపీ నేతలు...  
 
బీజేపీ చంద్రబాబుకి  సంధించిన పది ప్రశ్నలు ఇవే :
 
1. హోదా లేని రాష్ట్రానికి ప్యాకేజీ కింద 16వేల కోట్లు ఇచ్చినా మీరు తీసుకోకపోవడం నిజం కాదా?
2. అధికారం కోసం టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు రెవిన్యూ లోటు కింద వస్తాయా? వాగ్దానాలను రెవిన్యూ లోటులో ఎందుకు కలిపారు? 
3. ప్యాకేజికి ఓకే చెప్పి మళ్ళి హోదా అని ఎందుకు అంటున్నారు? అది మోసం కాదా?
4. డీపీఆర్‌ లేకుండా రాజధాని కోసం 1500 కోట్లు ఇస్తే ఆ డబ్బును పక్కదారిని పట్టించలేదా?
5. నాలుగేళ్లలో 11 విద్యా సంస్థలను నెలకొల్పింది నిజం కాదా?
6. విభజన చట్టంలో లేని విద్యా సంస్థలు, రక్షణ శాఖ ప్రాజెక్టులు ఇవ్వడం వాస్తవం కాదా?
7. రాష్ట్రానికి 24 గంటల విద్యుత్‌, పెట్రోలియం, నౌకయాన శాఖ ప్రాజెక్టు వంటి వాటికి నిధులు ఇవ్వడం నమ్మకద్రోహమా?
8.పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం నమ్మక ద్రోహమా?
9. అన్ని రాష్ట్రాల కంటే గ్రాంట్లు ఎక్కువ మంజూరు చేయడం నమ్మక ద్రోహమా?
10. రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగు స్మార్ట్‌ సీటీలు, 33 అమృత నగరాలు ఇచ్చింది నిజం కాదా?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.