జ‌గ‌న్ స‌మ‌క్షంలో వందమంది వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 13:44:16

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వందమంది వైసీపీ తీర్థం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాయ‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. 
 
ఒక వైపు పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌ క‌ష్టాల‌ను త‌న క‌ష్టంగా భావించి ప్ర‌తీ స‌మ‌స్య‌కు ప‌రిస్కారం ద‌క్కేలా చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇస్తున్నారు. మ‌రోవైపు అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ వైసీపీ అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌లకు అర్థ‌మ‌య్యే విధంగా జ‌గ‌న్ వివ‌రిస్తున్నారు. 
 
ఇక ఈ న‌వ‌ర‌త్నాల‌కు ఆక‌ర్షితులై టీడీపీకి చెందిన నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే తాజాగా గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆ ర్వాత వారు మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ముఖ్య‌మంత్రిని చేసేందుకు త‌మ‌వంతు కృషి చేస్తామ‌ని వారు హామీ ఇచ్చారు. 
 
గతంలో త‌మ‌ను ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఇంత ఆప్యాయంగా ప‌లుక‌రించ‌లేద‌ని మొద‌టిసారిగా రాజ‌కీయ నాయ‌కుడు జ‌గ‌న్ త‌మ‌ను ఆప్యాయంగా ప‌లుక‌రించి పార్టీలో చేర్చుకున్నార‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అందుకే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి కోసం ఏం చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నామ‌ని వారు స్ప‌ష్టం చేశారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.