బ్రేకింగ్.. చంద్ర‌బాబు మాల్ పై 13 కేసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu nadiu
Updated:  2018-08-24 15:02:23

బ్రేకింగ్.. చంద్ర‌బాబు మాల్ పై 13 కేసులు

జీఎస్టీ మోసాల‌కు పాల్ప‌డుతున్న వ్యాపార వాణిజ్య సంస్థ‌ల‌పై తనిఖీల కొర‌డాల శాఖ అధికారులు నేడు గ్రేట‌ర్ లో త‌నిఖీ చేశారు. వాస్త‌వానికి కేంద్ర ప్ర‌భుత్వం  జీఎస్టీ పేరుతో కొన్ని వ‌స్తువులపై ప‌న్నుమోత్తాన్ని త‌గ్గించింది. అయితే తగ్గించిన జీఎస్టీ ధ‌ర‌ల ప్ర‌కారం షాపింగ్ మాల్స్ సూప‌ర్ బ‌జార్ విక్ర‌యాలు జ‌రుగ‌డం లేదు. 
 
దీంతో త‌నిఖీల శాఖ‌కు భారీగా ఫిర్యాదులు వెళ్ల‌డంతో ఉన్న ఫ‌లంగా మెరుపు దాడీ చేశారు. 32 మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి గ్రేట‌ర్ పరిధిలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్ లో త‌నిఖీల‌ను చేప‌ట్టారు. అయితే ఈ త‌నిఖీలో కొన్ని సూప‌ర్ మార్కెట్ ల దందా బ‌య‌టప‌డింది.
 
సాక్షాత్తు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సూప‌ర్ మార్కెట్ లో అక్ర‌మ అమ్మ‌కాలు ఎమ్మార్పీల‌ ధ‌ర‌ల కంటే ఎక్కువ అమ్ముతున్నార‌ని అధికారులు గుర్తించారు. దీంతో హెరిటేజ్ సంస్థ‌పై సుమారు 13 కేసులు న‌మోదు చేశారు. అంతేకాదు హెరిటేజ్ బాట‌లోనే ప‌లు సూప‌ర్ మార్కెట్లు న‌డుస్తున్నాట్లు వెళ్ల‌డైంది. ర‌త్న‌దీప్,మోర్,స్పెన్సర్స్ బిగ్ బ‌జార్ వంటి మాల్స్ ల‌పై మోత్తం 125 కేసులు న‌మోదు అయ్యాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.