వైసీపీలో చేరిన 200 కుటుంబాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party
Updated:  2018-04-02 05:10:42

వైసీపీలో చేరిన 200 కుటుంబాలు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు న‌చ్చి తెలుగుదేశం నుంచి ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కులు వైసీపీలో చేరుతున్నారు... ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో తెలుగుదేశం పై నమ్మకం లేక, ఆ పార్టీలో కొన‌సాగ‌లేక చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారు.. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో చాలా మంది ద్వితీయ‌స్ధాయి నాయ‌కులు వైసీపీలో చేరుతున్నారు.
 
ఇక రాయ‌చోటిలో తెలుగుదేశం నాయ‌కులు వైసీపీలో చేరారు... రెండువందల కుటుంబాలు  వైఎస్ఆర్ సీపీలో చేరారు.....సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం  బండక్రింద హరిజన వాడ లో 60, వడ్డేపల్లె లో 100,పల్లంవాండ్ల పల్లె లో 10,కోటకాడ పల్లె 10,మహమ్మద్ నగర్ లో 20 కుటుంబాలకు చెందిన  తెలుగుదేశం  వర్గీయులు  వైఎస్ఆర్ సిపి నాయకులు ఆనంద రెడ్డి, బసిరెడ్డి,రమణా రెడ్డి  ఆధ్వర్యం లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షం లో చేరారు.. కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. 
 
తెలుగుదేశంలో ఇమ‌డ‌లేక అభివృద్దికి దూరం అవ‌డం వ‌ల్ల, వైసీపీలో చేరుతున్నామ‌ని త‌మ ప్రాంతం అభివృద్దికి కంక‌ణం క‌ట్టుకున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో ప‌నిచేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ని సీఎం చేస్తాం అని తెలియ‌చేశారు. శ్రీకాంత్ రెడ్డి పై ప్ర‌జ‌ల్లో న‌మ్మకం ఉంది అని, వైసీపీ వ‌చ్చే ఎన్నికల్లో రాయ‌చోటిలో విశేష‌మైన గెలుపు గెలుస్తుంది అని, శ్రీకాంత్ రెడ్డికి తిరుగులేదు అని తెలియ‌చేశారు.. రాష్ట్రంలో జ‌గ‌న్ ప‌రిపాల‌న వ‌స్తే శ్రీకాంత్ రెడ్డి త‌మ ప్రాంతాన్ని మ‌రింత అభివృద్ది బాట‌లో న‌డిపిస్తారు అని తెలియ‌చేశారు పార్టీలో చేరిన నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.