జ‌గ‌న్ స‌మ‌క్షంలో 200 వైసీపీ లో చేరిక‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-03 12:35:27

జ‌గ‌న్ స‌మ‌క్షంలో 200 వైసీపీ లో చేరిక‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట  తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ  పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అర‌చాక‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ  2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాలను వివ‌రిస్తు ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. అంతేకాదు మొన్న జ‌గ్గంపేట సాక్షిగా కాపు కార్పోరేష‌న్ సంఘాల‌కు 10వేల కోట్లు కేటాయిస్తాన‌ని సంచ‌ల‌న హామీ ఇచ్చారు.
 
జ‌గ‌న్ కాపుకార్పోరేష‌న్ కు నిధుల‌ను కేటాయించ‌డంతో వాటికి ఆక‌ర్షితులు అయిన టీడీపీ కాపు నాయ‌కులు సుమారు 200 మంది జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. వైసీపీ తీర్థం తీసుకున్న‌ త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కాపులును బీసీల్లో చేర్చుతాన‌ని చెప్పి త‌మ‌ను నిలువునా ముంచేశార‌ని వారు వాపోతున్నారు. 
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాపు కార్పోరేష‌న్ల‌పై క్లారిటీ ఇవ్వ‌డంతో అందుకు తాము ఆక‌ర్షితులై టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరామ‌ని స్ప‌ష్టం చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేందుకు త‌మవంతు కృషిచేస్తామ‌ని వారు స్పష్టం చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.