2014 నుంచి 2018 పార్టీ ఘ‌న‌త

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu fake schemes
Updated:  2018-03-27 03:44:22

2014 నుంచి 2018 పార్టీ ఘ‌న‌త

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక‌హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లారు చంద్ర‌బాబు.. 600 హామీల‌తో మేనిఫెస్టో పుస్త‌కాన్ని ప్ర‌ద‌ర్శించారు.. అయితే ఇప్పుడు ఆ హామీలు నెర‌వేర్చ‌మంటే కేంద్రం సాయం చేయ‌డం లేదు అంటున్నారు.. అప్పుడు మేనిఫెస్టో ఇచ్చిన‌ప్పుడు ఈ మాట ఎందుకు చెప్ప‌లేదు, కేంద్రం సాయం చేయ‌క‌పోతే చేయం అని ఎందుకు చెప్ప‌లేదు అని ప్ర‌జ‌ల త‌ర‌పున వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీగా విమ‌ర్శిస్తోంది ప్ర‌శ్నిస్తోంది.. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న నాయ‌కుల‌ను ప‌లు వివాదాల్లో ఇరుక్కున్నా వెనక‌వేసుకురావ‌డం కూడా ఇక్క‌డ ప్ర‌శ్నిస్తున్నారు.
 
సీఎం చంద్ర‌బాబు, పార్టీ పై, నాయ‌కుల పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు చూసిన‌ట్టు అయితే
ఓటుకు నోటు కేసు దిల్లీకి వెళ్ల‌డం
రాజధాని పేరు తో భూమి కుంభకోణం (ఇన్ సైడర్ ట్రేడింగ్)
ఇసుక మాఫియా
ఎర్రచందనం మాఫియా
పవర్ ప్రాజెక్టుల లంచాలు
కాల్ మని మాఫియా 
లిక్కర్ మాఫియా 
రాజధాని లో పంటలు  తగలబెట్టడం 
కాలేజీలలో కుల ర్యాగింగ్ మరణాలు 
ప్రభుత్వ అధికారులమీద బౌతిక దాడులు 
పుష్కర ప్రచార పిచ్చితో 30 మంది మరణాలు 
కాపుల తో రాజకీయ క్రీడ 
పట్టిసీమ లో పర్సంటేజ్ లు
సదావర్తి సత్రం భూముల  స్కాం
కనక దుర్గమ్మ భూముల కుంభకోణం
ప్రతిపక్ష యం.ఎల్.ఏ లని చట్ట విరుద్దం గా మంత్రులని చేయటం
కొడుకు లోకేష్ ని మంత్రిని చేసుకోవడం నిరుద్యోగిత‌ని మ‌ర్చిపోవ‌డం
అగ్రిగోల్డ్ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌క‌పోవ‌డం
 
ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఈ పనుల చేశాము అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.. అవి ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాయి? ఎంత వ‌ర‌కూ  ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యాయి అనేది తెలుసుకుందాం?
 
సంపూర్ణ రుణమాఫి చేయడం లో ఫెయిల్
డ్వాక్రా రుణమాఫి చేయడం లో 
బెల్టుషాపుల రద్దు చేయడం లో 
ఆంధ్రా కి ఆయువు అయిన పోలవరం నిర్మాణం లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు 
ఇంటికో ఉద్యోగం ఇవ్వటం లో స‌క్సెస్ కాలేదు
ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇవ్వటం లో ఫెయిల్
రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడులు తీసుకుని రావటం లో ఫెయిల్
రాజధాని నిర్మాణం లో ఫెయిల్
పేదలకు 1 లక్ష 50 వేలతో ఇల్లు ఇవ్వటం లో ఫెయిల్
కె.జి నుండి పి.జి దాక ఉచిత విద్య అని, ఇవ్వటం లో 
ఎన్.టి.ఆర్ హెల్త్ కార్డ్ తో ఆరొగ్య శ్రీ కన్నా మెరుగైన సేవలు అని డప్పు కొట్టుకున్నారు ఆచరణ లో ఫెయిల్
ఎన్.టి.ఆర్ క్యాంటిన్ ఫెయిల్
ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి పథకం తో 2 రూ 20 లీటర్ల మినరల్ వాటర్ అందించటం లో ఫెయిల్
కాపులకి ఇచ్చిన హామీ ని నెరవేర్చటం లో ఫెయిల్ 
 
ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇదే  చ‌ర్చ జ‌రుగుతోంది తెలుగుదేశం ఎటువంటి రాజ‌కీయం చేస్తుందో 2014 నుంచి ప్ర‌జ‌లు అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు అని షేర్ల మీద షేర్లు చక్కెర్లు కొడుతోంది ఈ పోస్టు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.