మోదీ రైల్వే బ‌డ్జెట్ ఎక్స్ ప్రెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 05:00:09

మోదీ రైల్వే బ‌డ్జెట్ ఎక్స్ ప్రెస్

దేశీయంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీసుకువ‌స్తున్న సంస్క‌ర‌ణ‌ల‌తో దేశం ముందుకు న‌డుస్తోంద‌ని, ప్ర‌పంచ ఆర్దిక వ్య‌వ‌స్ద‌లో భార‌త్ మ‌రింత  బ‌లంగా మారుతోంద‌ని అన్నారు కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ.. తాజాగా 2018-19 బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టింది కేంద్రం..  రైల్వే బ‌డ్జెట్ కేటాయింపులు ఇప్పుడు చూద్దాం. 
 
రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించనున్నారు.
రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
అన్ని రైల్లే స్టేషన్లలో దశలవారిగా వైఫై, సీసీటీవీల ఏర్పాటు
25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ
4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
 
ఈ బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు... తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన కొత్తలైన్లు, ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులివే..
 
కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 430 కోట్లు కేటాయింపు
విజయనగరం-స్తంభాలపూర్‌ మూడో రైల్వేలైన్‌కు రూ. 90 కోట్లు
నడికుడి-కాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు రూ. 340 కోట్లు
కాజీపేట-విజయవాడ మూడో రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు
నల్లపాడు-గుంతకల్‌ లైను విద్యుదీకరణకు రూ. 150 కోట్లు
విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్‌-నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్‌ పనులకు రూ. 122 కోట్లు కేటాయింపు
 
విజయనగరం-రాయగడ-రాయపూర్‌ విద్యుదీకరణకు రూ. 120 కోట్లు
విజయవాడ-గూడురు మూడోలైన్‌కు రూ. 100 కోట్లు
ఓబులవారి పల్లె-కృష్ణపట్నం కొత్త రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు
గుంతకల్‌-బళ్లారి హోస్పేట్‌ విద్యుదీకరణకు రూ. 70 కోట్లు
కడప-బెంగళూరు రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 240 కోట్లు
కాకినాడ-పిఠాపురం కొత్త రైల్వేలైన్‌కు రూ. 150 కోట్లు
మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు
మనోహరాబాద్‌ (మేడ్చల్‌)-కొత్తపల్లి (కరీంనగర్‌) లైన్‌కు రూ. 350 కోట్లు
అక్కన్నపేట-మెదక్‌ మధ్య 17 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు రూ. 196 కోట్లు
భద్రాచలం నుంచి సత్తుపల్లి కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు
కాజీపేట-బళ్ళారీ మూడోలైన్‌కు రూ. 160 కోట్లు
సికింద్రాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులకు రూ. 50 కోట్లు
హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండోఫేజ్‌కు రూ. 100 కోట్లు
రూ. 5 కోట్లతో చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్‌ టర్మినల్‌
తెలంగాణలో నిర్మాణం కానున్న ఏ-1 స్టేషన్లు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.