ఏపీ బడ్జెట్‌ 2018-19

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap assembly image
Updated:  2018-03-08 01:31:50

ఏపీ బడ్జెట్‌ 2018-19

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికిగాను  ఆయన ఈ రోజు ఏపీ శాసనసభలో ఉద‌యం 11.30గంటలకు బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు.. ఇక ఎన్నిక‌ల‌కు కేవ‌లం సంవ‌త్స‌రం స‌మ‌యం ఉండ‌టంతో ఈ బడ్జెట్ ఏపీ స‌ర్కారుకు ఎంతో కీల‌కం కానుంది.. ఏపీ స‌ర్కార్  ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్  ముఖ్య‌మైన అంశాలు ఇప్ప‌డు తెలుసుకుందాం.
 
మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు
మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు
వృద్ధిరేటు : 10.96శాతం
 
గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు
సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు
ఇరిగేషన్‌ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు
సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నాం
సాంఘిక సంక్షేమ రంగానికి రూ.13,722 కోట్లు
వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.5వేల 52కోట్లు
పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు
రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు
పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు
వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు
కాపులకు రూ.వెయ్యి కోట్లు
కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు
దూదేకులవారికి కేటాయింపులు.. 40కోట్లు
నాయీ బ్రాహ్మణులకు 30కోట్లు
వెనుకబడిన తరగతుల సంస్థకు 100కోట్లు
వాల్మీకీ బోయిలకు 50కోట్లు
విద్యారంగానికి రూ.24,180కోట్లు
సాంకేతిక విద్యకు రూ.818కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635కోట్లు
వైద్యరంగానికి రూ.8,463కోట్లు
మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు
గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు
కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు
సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు
సమాచార శాఖకు రూ.224కోట్లు
రుణమాఫీకి రూ.4100కోట్లు
వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు
సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు
ఎన్టీఆర్‌ వైద్య సేవలు రూ.1000 కోట్లు
స్టార్ట్‌ అప్‌లకు రూ.100 కోట్లు
సామాజిక భద్రతకు రూ.3029కోట్లు
గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు
చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు
మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు
నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.200 కోట్లు
పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు
రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,300కోట్లు
చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.