ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ట్లే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap cm jagan
Updated:  2018-03-20 02:20:48

ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ట్లే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి చూస్తే, గ‌తంలో ప్ర‌జ‌లు అనుకున్న విధంగా, 2019 లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ముఖ్య‌మంత్రి అయిన‌ట్లే...   ఏంటి... అర్ధం కాలేదా.. ? అయితే మ‌నం ఓ నాలుగేళ్లు వెన‌క్కు వెళ్లాల్సిందే....
 
2014 ఎన్నిక‌ల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం ఐదు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే... అయితే వాస్త‌వానికి ఎన్నిక‌ల ముందు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు కూడా వైసీపీ అధికారంలోకి వ‌స్తుందని, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని అనుకున్నారు... కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు, వైసీపీ ఓటమికి కూడా అన్నే కారణాలు అందుకే ప్ర‌తిప‌క్ష హోదాతో సరి పెట్టుకోవాల్సి వ‌చ్చింది... 
 
కానీ జ‌గ‌న్ గెల‌వ‌క‌పోవ‌డానికి గల సవాలక్ష కారణాలలో కొన్ని ముఖ్యమైన కారణాలను మనం గుర్తు చేసుకుంటే...
 
1. రాష్ట్రం విడిపోవడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే అనుభవం ఉన్న నాయకుడే కావాలి జగన్ కి అనుభవం లేదు అని బాబు డప్పు కొట్టుకోవడంతో నమ్మి బాబుకు ఓటేశారు ప్ర‌జ‌లు...
 
2. రుణమాఫీతో రైతులని, డ్వాక్రా రుణాల మాఫితో మహిళలని, నిరుద్యోగ భృతి అనే పేరుతో యువకుల్ని, ఇలా వర్గానికో ఒక హామీ ఇచ్చి ఆకట్టుకోవడంతో జగన్ కి భంగపాటు కలిగింది.
 
3. ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో చక్రం తిప్పగల బాబుకే ఓటేయండి అని కుల మీడియా భజన చేయడంతో ప్రజలు మోసపోయి ఓటు వేశారు..
 
4. మోడీ, పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న ఆకర్షణతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు..
 
5. సుమారు 600 పైగా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడంతో అధికారం దక్కించుకున్నారు చంద్ర‌బాబు... 
 
అదే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చుస్తే 2019 లో జగన్ ముఖ్య‌మంత్రి అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది..దానికి గల కారణాలను విశ్లేసిస్తే...
 
1. ప్రతి పక్ష నేతగా అసెంబ్లీలో ఉన్న నాలుగేళ్లలోనే ప్రతి అంశాన్ని లెక్కలతో సహా అనర్గళణంగా మాట్లాడడంతో పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా పరిపూర్ణత చెందడం..
 
2.  రైతుల రుణమాఫీ చేయడం అసాధ్యం అని చెప్పి ఎన్నికలకి వెళ్లడంతో, జగన్ లో ఉన్న నిజాయితీ, నిబద్ధతలని రుణమాఫీ జరగకపోవడంతో ప్రజలు గుర్తించడం.
 
3. అధికార పార్టీ  ప్ర‌త్యేక ప్యా కేజీకి జై కొట్టి... కేంద్రానికి స‌లాం కొట్టడంతో ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత రోజు రోజుకి పెరగడం..
 
4. ప్ర‌త్యేహ హోదా అవసరం లేదు అన్న వాళ్ళతో కూడా ప్రత్యేక హోదాకె జై కొట్టేలా చేయడం...
 
5. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దానిని కూడా అధికార పార్టీ నెరవేర్చక పోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉండటం..
 
6. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు, ఎన్నో ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న అధికార పార్టీ నాయ‌కులే స‌మాధానం ఇవ్వ‌లేక పోవడం...
 
7 పాదయాత్రతో జగన్ మైలీజ్ పెరుగుతుంటే, చంద్రబాబు రెండు నాల్కుల ధోరణితో డ్యామేజ్ అవుతుంది..

షేర్ :

Comments

1 Comment

  1. ఇది నిజ జరిగి తీరుతుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.