2019 లో పోటీ చేసే గుర్రాలు వీరే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 15:38:49

2019 లో పోటీ చేసే గుర్రాలు వీరే

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర టీడీపీ కంచుకోట జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల కంటే కోస్తాంధ్ర ప్ర‌జ‌లే అధిక సంఖ్య‌లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 
 
ఇక తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన‌ అసెంబ్లీ సీట్లకు సంబంధించిన‌ అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న దాని గురించి ఇప్పుడు కొత్త వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ఏ జిల్లాలో అయితే పాద‌యాత్ర ముగించుకుంటారో ఆ మ‌రుస‌టి రోజే ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ స‌ర్వేను నిర్వ‌హిస్తుంద‌ట‌. ఈ స‌ర్వేలో మొద‌టగా వైసీపీ పై ప్ర‌జ‌ల అభిప్రాయం, అలాగే ప్లీన‌రి సాక్షిగా ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు, దీంతో పాటు ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో ఏ అభ్య‌ర్థి అయితే టీడీపీకి పోటీగా నిల‌బ‌డుతారు అలాగే ఆయ‌న గురించి ప్ర‌జ‌ల అభిప్రాయం ఏంటో పీకే టీమ్ తెలుసుకుంటుంది. 
 
ఇక స‌ర్వే పూర్తి అయిన త‌ర్వాత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే గెలుపు గుర్రాల‌ను ఫైన‌ల్ చేశార‌నే వార్త గుంటూరు నాట గుస‌గుస‌లు. న‌ర‌స‌రావుపేటకు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, అలాగే గుంటూరు ఎంపీగా విజ్ఞాన్ సంస్ద‌ల అధినేత లావు ర‌త్త‌య్య కుమారుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌కు ఫిక్స్ చేశార‌ట‌. 
 
ఇక ప‌నిలోప‌నిగా జ‌గ‌న్ ఎమ్మెల్యే గా పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను కూడా ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. వినుకొండ నుంచి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, తెనాలి నుంచి అన్నాబ‌త్తుని శివ‌కుమార్,అలాగే పొన్నూరు నుంచి రావివెంక‌ట‌ర‌మ‌ణ ఇక చివ‌రిగా చిల‌క‌లూరి పేట నుంచి మ‌ర్రి ఫ్యామిలీలో ఒక‌రికి సీటు జ‌గ‌న్ క‌న్ఫామ్ చేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక దీని బ‌ట్టి చూస్తుంటే ఈ నాలుగు సీట్లపై ద‌రిదాపు క్లారిటీ వ‌చ్చింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ జిల్లాలో ఎక్కువ శాతం క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్నాయి. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి ఈ రెండు వ‌ర్గాలు  రెండు క‌ళ్లులాంటివి. అందుకే జ‌గ‌న్ ఈ జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక వ్య‌క్తిని నిల‌బెట్టాలని అప్పుడే వైసీపీకి  మ‌రింత మెజార్టీ వ‌స్తుంది అని అంటున్నారు జిల్లా వైసీపీ నాయ‌కులు. ఇక క‌న్నా ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి వెళ్ల‌డంతో పెద‌కూర‌పాడు సీటు పై కూడా క్లారిటీ వ‌చ్చింది.. ఇక్క‌డ పెద‌కూర‌పాడు సీటును నంబూరి శంక‌ర‌రావుకు ఫిక్స్ చేశారు జ‌గ‌న్‌.. ఇక ప్ర‌జ‌ల నుంచి ఐదు మండ‌లాల్లో మద్ద‌తు ఉంద‌ని గుర్తించి శంక‌ర‌రావుకు టికెట్ ఫిక్స్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.