బ్రేకింగ్ జ‌న‌సేన‌లోకి 20మంది ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-08-25 04:47:39

బ్రేకింగ్ జ‌న‌సేన‌లోకి 20మంది ఎమ్మెల్యేలు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అయితే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  పార్టీ స్థాపించినప్ప‌టినుంచి ఎవ్వ‌రూ చేర‌కున్నారు. వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, సీనియ‌ర్ నాయ‌కులు కానీ, అభిమానులు కానీ ఎవ్వ‌రు జ‌న‌సేన వైపు క‌న్నెత్తి కూడా చూడ‌కున్నారు. 
 
ప్ర‌తీ ఒక్క‌రికి క‌నిపించేది ఫ్యాన్ సైకిల్ ఈ రెండు పార్టీలే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోనున్న క్ర‌మంలో ఎవ్వ‌కు జ‌న‌సేన వైపు చూడ‌కున్నారు. రాజ‌కీయంగా నిరుద్యోగంతో ఉన్న ఆయా పార్టీల నాయ‌కులు కూడా వైసీపీ టీడీపీ వైపు చూస్తున్నారు కానీ జ‌న‌సేన‌వైపు మాత్రం చూడ‌కున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పార్టీకి చెందిన‌ చోటా మోటా నాయ‌కులు ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేస్తున్నారు.
 
మ‌రో కొద్ది రోజుల్లో ఇత‌ర పార్టీల‌కు చెందిన సూమారు 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతున్నారంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక వారు అన్న మాట‌లు కాస్త సోష‌ల్ మీడియా నుంచి తెగ సెటైర్లు వ‌స్తున్నాయి. మ‌రికొద్ది రోజుల్లో జ‌న‌సేన తీర్థం తీసుకునేందుకు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు రెడిగా ఉన్నార‌ని పార్టీకి చెందిన క‌న్వీన‌ర్ పార్థ‌సార‌థి తెలిపారు. అంతేకాదు వారు పార్టీలో చేర‌డంపై ఇప్ప‌టికే అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ వారితో మంత‌నాలు కూడా జ‌రిపార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
మంచిరోజు చూసుకుని వారంద‌రు జ‌నసేన‌లోకి చేరుతార‌ని పార్థ‌సార‌ధి తెలిపారు. పాత కొత్త త‌రంతో ముందుకు వెళ్తున్న పార్టీ జ‌న‌సేన పార్టీఅని వ‌చ్చేఎన్నిక‌ల్లో సూమారు 60 శాతం సీట్లు న‌వ‌త‌రానికి ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఓ మేనిఫెస్టో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్క‌టి చొప్పున మేనిఫెస్టో త‌య‌రు చేస్తామ‌ని ఆయ‌న పార్థ‌సార‌థి తెలిపారు. 
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీలో ప్ర‌స్తుతం ఎవ్వ‌రు చేర‌కున్నారు ఎవ‌రు అడిగితే వారికి టికెట్ ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే 60 శాతం ఏంటి 99 శాతం జ‌న‌సేన అధిష్టానం యువ‌త‌రానికే టికెట్లు ఇస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.