టీడీపీకి 40 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 10:23:13

టీడీపీకి 40 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై

జ‌నసేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మొన్న గుంటూరులో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు పై అత‌ని కుమారుడు మంత్రి లోకేశ్ పై అలాగే టీడీపీ నాయ‌కుల‌పై ప్లీన‌రీ  సాక్షిగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... సైకిల్ పార్టీ నాయ‌కులు కేంద్ర నిధుల నుంచి మ‌ట్టిదాక అధికార అండ‌తో విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నార‌ని ప‌వ‌న్ తెలిపిన సంగ‌తి తెలిసిందే... 
 
అయితే ప‌వ‌న్ టీడీపీ నాయకుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ ఎక్క‌డ మీడియా దొరికితే అక్క‌డ ఫిరాయింపు మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి, బీకాంలో ఫిజిక్స్ జ‌లీల్ ఖాన్ వంటి వారు ప‌వ‌న్ పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు...  అయితే ముఖ్య‌మంత్రి, ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్దు అని చెప్పినా వినకుండా కొంత‌మంది టీడీపీ నాయ‌కులు ప‌వ‌న్ పై త‌మ దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు...
 
అయితే తాజాగా మంత్రి లోకేశ్ కూడా కొద్దిరోజుల క్రితం ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేశారు... తాను త‌న తాతలాగా, అలాగే త‌న తండ్రి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లాగా ప్ర‌జ‌ల‌లో మంచి గుర్తింపు తెచ్చుకోకపోయినా వారికి చెడ్డ‌పేరు మాత్రం తీసుకురాన‌ని తెలిపారు... దీంతో పాటు తాను అవినీతికి పాల్ప‌డుతుంటే త‌న నంబ‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర ఉంద‌ని ఫోన్ చేసి అగ‌వ‌చ్చుక‌దా అని ప్ర‌శ్నించారు లోకేశ్... ఇదంతా పవన్ క‌ల్యాణ్ బీజేపీతో కలిసి దొంగాటలాడుతున్నారంటూ లోకేశ్ మండిప‌డ్డారు..
 
అయితే ఈ నేపథ్యంలో త‌న‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై జ‌న‌సేన అధినేత స్పందించారు... ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స్వ‌యానా టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు వైఖ‌రిపై త‌న‌కు ఫిర్యాదు చేశార‌ని, వారు చెప్పిన విధంగానే తాను గుంటూరులో జ‌రిగిన జ‌న‌సేన ప్లీన‌రీ వేదిక‌లో చెప్పాన‌ని అన్నారు... 
 
అయితే ఇదే విష‌యాన్ని తాను చంద్ర‌బాబుతో చెప్పాల‌ని ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నించాన‌ని కాని వారు త‌మ మాట‌ను తేలిక‌గా కూర‌లో క‌రివేపాకులా తీసిపారేశార‌ని అన్నారు.... కాగా  ఈ విష‌యాన్ని ప‌వ‌న్ మీడియాతో తెలిపేస‌రికి ముఖ్య‌మంత్రి గుండెల్లో రైలు ప‌రుగులు తీస్తోన్న‌ట్లు తెలుస్తోంది... ఒక‌వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్లు బాబుపై 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారు వచ్చే ఎన్నిల‌లోపు పార్టీని ఫిరాయించే దిశ‌లో అడుగువేస్తోన్న‌ట్లు తెలుస్తోంది... ఈ 40 మంది ఫిరాయిస్తే 2019  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం చేపట్ట‌డం అసాధ్యమని తెలుస్తోంది... దీంతో హుటాహుటీన ముఖ్య‌మంత్రి పార్టీ ఎమ్మెల్యేలతో ఒక మీటింగును ఏర్పాటుచేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
 
కాగా ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారంలో కూడా విభ‌జ‌న హామీల‌ను ఒక్క‌టి కూడా కేంద్రంతో సాధించ‌క పోవ‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌పై ప్ర‌జ‌లు అసంతృప్తి వైఖ‌రిని తెలియ‌జేస్తున్నారు... 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.