గ‌వ‌ర్న‌ర్ పై అంబ‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 05:26:11

గ‌వ‌ర్న‌ర్ పై అంబ‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుర్చీలో హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూర్చోవడాన్ని త‌ప్పుబ‌ట్టడంతో పాటు గ‌వ‌ర్న‌ర్  వ్య‌వ‌హార తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. 
 
గవర్నర్‌ నరసింహన్‌ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిలా వ్య‌వ‌హరిస్తున్నార‌ని అంబ‌టి ఆరోపించారు.   ఈ మ‌ధ్య  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని పొగుడుతున్నార‌ని, రాజ్యంగా ఉల్లంఘ‌నలు జ‌రుగుతుంటే మాత్రం  చూస్తూ ఉన్నార‌ని అన్నారు
 
ఏపీలో రాజ్యాంగం అప‌హాస్యం పాల‌వుతోంద‌ని, అయినా కూడా గ‌వ‌ర్న‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఏద్దేవా చేశారు. రాజ్యంగాన్ని కాపాడాల్సిన బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్ పై ఉంద‌ని గుర్తు చేశారు. ఫిరాయింపుల అంశాన్ని  ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పార్టీ మారిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  డిమాండ్ చేశారు. 
 
ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొన‌సాగ‌డం అనైతిక‌మ‌ని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లతో పాటు...పార్ల‌మెంటులో  ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఫిరాయింపుల వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి గెలిపించుకోవాల‌ని టీడీపీకి అంబ‌టి డిమాండ్ చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.