అంబ‌టి ఫ్యామిలీ పై టీడీపీ ఎత్తుగ‌డ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 03:06:48

అంబ‌టి ఫ్యామిలీ పై టీడీపీ ఎత్తుగ‌డ

స‌మ‌యం లేదు మిత్ర‌మా ఎన్నిక‌ల‌కు ఎన్ని అవ‌కాశాలు ఉంటే అన్ని అవ‌కాశాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటాం అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు, దీనిని వైసీపీ బ‌ల్ల గుద్దీ మ‌రీ చెబుతోంది..  ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ఇంకా సంవ‌త్స‌రం ఉంది, అయితే అవ‌కాశాలు ఇప్పుడే వెతుక్కుంటోంది సైకిల్ పార్టీ అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి...తాజాగా వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు తెలుగుదేశం నాయ‌కుల పై ధ్వ‌జ‌మెత్తారు.
 
త‌న ఓటు గ‌ల్లంతు అయింద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో తాను స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేశాను అని,  కాని ఇప్పుడు నా ఓటు లేద‌ని ఆయ‌న త‌న ఆవేద‌న వ్య‌క్త‌ప‌రిచారు..సత్తెనపల్లిలో తనతో పాటు తన భార్య, ముగ్గురు కుమార్తెలకు ఓటు హక్కు ఉండగా, ప్రస్తుతం తన కుటుంబంలో కేవలం ఒక్క చిన్న కుమార్తెకు మాత్రమే ఓటు హక్కు ఉంచి, మిగిలినవన్నీ జాబితా నుంచి తొలగించారని అంబటి తెలిపారు... దీని వెనుక కుట్ర ఉంద‌ని రాజ‌కీయంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అని ఆయ‌న ఫైర్ అయ్యారు.
 
త‌న ఓటు లేక‌పోవ‌డం వ‌ల్ల  తాను ఉంటున్న గుంటూరులో, తాజాగా సత్తెనపల్లిలో కూడా ఓటు లేకుండా పోయిందని ఆయ‌న వెల్ల‌డించారు... నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కుల‌వి వైసీపీ అభిమానుల‌వి ఓట్లు మిస్ అవుతున్నాయ‌ని అన్నారు...వైసీపీ అనుకూలంగా ఉండేవారి ఓట్లు తొలిగిస్తున్నారని,  ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న  కోడెల శివ‌ప్ర‌సాద్ కు ఈ అల‌వాటు ఉందని, త‌మ పై కుట్ర చేస్తున్నార‌ని ఈ విష‌యం పై  ఉన్న‌తాధికారులు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌ని అన్నారు అంబ‌టి రాంబాబు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.