టీడీపీకి బీజేపీ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 03:53:21

టీడీపీకి బీజేపీ షాక్

ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజా వార్షిక బ‌డ్జెట్ లో ఏపీకి తెలంగాణ‌కు ఎటువంటి కేటాయింపుల చేయ‌లేదు.. ఈ ఏడాది వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న రాష్ట్రాల‌పైనే వ‌రాల జ‌ల్లు కురిపించారు మోదీ - అమిత్ షా.. వేల కోట్ల రూపాయ‌లు క‌ర్ణాట‌క కు కేటాయించిన మోదీ స‌ర్కార్ ఏపీకి ఎటువంటి అండ అందించ‌లేక‌పోయింది.. దీనిపై ఏపీలో అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇటు తెలంగాణ‌కు కూడా ఎటువంటి ప‌థ‌కాలు - నిధులు కేటాయించ‌లేదు మోదీ ప్ర‌భుత్వం.
 
దీంతో రెండు తెలుగురాష్ట్రాల్లో  బీజేపీ పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.. అలాగే ఆ పార్టీకి స‌పోర్టు చేసే పార్టీల‌ను కూడా ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు దీంతో రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం టీఆర్ ఎస్ పార్టీలు ఆచితూచి రాజ‌కీయంగా అడుగులు వేస్తున్నాయి.. ఏపీ తెలంగాణ‌లో ప‌రిస్దితి ఇలా ఉంటే?  బీజేపీ అధినాయ‌క‌త్వం తాజాగా హ‌స్తిన‌లో స‌మావేశం ఏర్పాటుచేసింది.. తెలంగాణ త‌రపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి హ‌జ‌ర‌య్యారు.  ఈ స‌మావేశంలో  వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంతంగా పోటి చేయ‌డం మంచిద‌ని, టీడీపీ పొత్తు వ‌ల్ల న‌ష్ట‌పొతామ‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నేత‌లు తెలిపారు.
 
అధికార పార్టీ ఫిరాయింపుల‌ వ‌ల్ల తెలుగుదేశం పార్టీ  కేడ‌ర్ మొత్తం దెబ్బ‌తింద‌ని, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని  సైతం  వెన‌క్కినెట్టి  బీజేపీ బ‌ల‌ప‌డింద‌ని సూచించారు. ప్ర‌భుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని అందిపుచ్చుకుని టీఆర్‌య‌స్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని  నిరూపించుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని తెలిపారు.దీంతో అమిత్‌ షా  ఒంటరి పోరుకి సిద్ధం కావాలని తెలంగాణ నేత‌ల‌కు స్పష్టం చేశారని తెలుస్తోంది.
 
తాజాగా తెలంగాణ‌ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాకు కొన్ని కీల‌క విష‌యాలు తెలియ‌చేశారు..ఒంట‌రి పొరుకు ఢిల్లీ నాయకత్వం కూడా ఒప్పుకొందని అన్నారు ల‌క్ష్మ‌న్.....కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని చెప్పారాయ‌న‌. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డుతుండ‌డం వ‌ల్ల అధికార పార్టీ నేత‌ల‌ గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ని లక్ష్మణ్  అన్నారు. ఎన్నిక‌ల్లో  పోటీ విష‌యం పై అమిత్‌షా ఈ నెల‌లో రాష్ట్రానికి వచ్చి మరోసారి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అయితే ఏపీ క‌మ‌లం నాయ‌కులు కూడా ఆయ‌నతో భేటీ అయ్యి తెలుగుదేశానికి క‌టీఫ్ చెప్పించాలి అని చూస్తున్నారు...

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.