జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా త‌ప్పుచేశారు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 03:47:05

జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా త‌ప్పుచేశారు?

నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల నుంచి  పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు వ‌స్తోంది.. అయితే జిల్లాలో ఫిరాయింపులు చేయాలి అని అనుకున్న తెలుగుదేశం ప్లాన్ వ‌ర్క్ అవుట్ కాలేదు.. దీంతో పార్టీలో నాయ‌కులు కూడా సైలెంట్ గానే ఉన్నారు.. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేకు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎటువంటి రెస్పాన్స్ ప్ర‌జల నుంచి వ‌స్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు.
 
వేనాటి కుటుంబం  వైసీపీలో చేర‌డంతో వైసీపీకి సూళ్లూరుపేట‌లో మ‌రింత అండ పెరిగింది అనేది తెలుస్తోంది...ఇక వైసీపీకి  గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీ సీట్ల సంఖ్య  ఈ సారి ఇక్క‌డ క్లీన్ స్వీప్ చేయాలి అని భావిస్తున్నారు.. అయితే తెలుగుదేశం త‌ర‌పున సీనియ‌ర్లు జూనియ‌ర్లు నెల్లూరు నుంచి ఎంత మంది ఉన్నా, ప్ర‌స్తుతం మంత్రి నారాయ‌ణ, మంత్రి సోమిరెడ్డి ఎమ్మెల్సీలుగా పార్టీలోకి వ‌చ్చి మంత్రులు అయ్యారు.. అయితే జిల్లాలో మ‌రో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని భావించింది ఆనం ఫ్యామిలీ, అయితే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన  ఫ్యామిలీ పైగా గ‌తంలో ఆర్ధిక మంత్రిగా చేశారు కాబ‌ట్టి, వారికి బాబు పెద్ద పీట వేస్తారు అని అంద‌రూ అనుకున్నారు... కాని నెల్లూరు రాజ‌కీయాల్లో వారిని క‌రివేపాకు రాజ‌కీయాలుగా బాబు వాడుకున్నారు అని వారు మ‌ద‌న‌ప‌డుతున్నారు.
 
ఆనం ఫ్యామిలీలో ఆనం రామనారాయ‌ణ రెడ్డి వివేకానంద‌రెడ్డికి పార్టీలో ప‌ద‌వులు వ‌స్తాయి అని వారి కేడ‌ర్ కూడా భావించింది, కాని దీనికి రివ‌ర్స్ గా బాబు వారికి ఎటువంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. అయితే ఆనం ఫ్యామిలీ వైసీపీకి వెళ్లి ఉంటే వారి పొలిటిక‌ల్ లైఫ్ వేరేగా ఉండేద‌ని, ఇప్పుడు ఉన్నా కేడ‌ర్ కూడా అంటున్నారు. జ‌గ‌న్ వద్ద‌కు వెళ్లి ఉంటే వైసీపీలో వారికి స‌ముచిత స్ధానం ఉండేది అని, కాని తెలుగుదేశంలో వారిని ప‌ట్టించుకునే నాయ‌కులే  లేరని త‌మ్ముళ్లు అంటున్నారు.. మొత్తానికి ఆనం ఫ్యామిలీ తెలుగుదేశంలోకి వెళ్ల‌కుండా వైసీపీ వైపు అడుగులు వేసి ఉంటే బాగుండేది అని జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.