గాలికి మ‌రో షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 06:53:28

గాలికి మ‌రో షాక్

ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి మ‌రో షాక్ త‌గిలింది. అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌స్తుతం గాలి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. గతంలో క‌డ‌ప జిల్లాలో ఏర్పాటు చేసిన బ్రాహ్మ‌ని ఇండస్ట్రీస్ కు సంబంధించి  తాజాగా గాలికి చుక్కెదురైంది. 
 
జిల్లాలోని బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు సంబంధించిన  సుమారు రూ.189 కోట్ల విలువ చేసే  యంత్రాలను డీఆర్‌ఐ సీజ్‌ చేసింది. 2009 సంవత్స‌రంలో చెన్నై ఓడరేవు నుంచి బ్రాహ్మణి ఇండస్ట్రీస్ యంత్రాలను దిగుమతి చేసుకుంది. బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ డీఆర్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు..... విదేశాల నుంచి తీసుకొచ్చిన ఈ యంత్రాలను బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉపయోగించడంలేదు ఈ క్ర‌మంలో ఆ యంత్రాల‌ను సీజ్ చేసిన‌ట్లు  తెలుస్తోంది. .

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.