తెలుగుదేశానికి మ‌రో సీనియర్ ఏపీలో గుడ్ బై ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 11:33:07

తెలుగుదేశానికి మ‌రో సీనియర్ ఏపీలో గుడ్ బై ?

కేంద్రం లో అధికారంలో ఉన్న మోదీ స‌ర్కార్ ఏపీలో - తెలంగాణ‌లో బీజేపీ ఎదుగుద‌ల‌కు అనేక రాజ‌కీయ ఎత్తుల‌ను వేస్తోంది.. ఏపీలో మ‌రీ ముఖ్యంగా మోదీ మార్క్ క‌నిపించేలా కేంద్రం రాజ‌కీయంగా అడుగులు వేస్తోంది... అందుకే తెలుగుదేశంలో, వైసీపీలో ఉన్న నాయ‌కులు బీజేపీలో చేరేలా స్ట్రాట‌జీని అమ‌లు ప‌రుచుతున్నారు అమిత్ షా... అయితే క‌మ‌లం పార్టీలోకి నాయ‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఆపరేష‌న్  క‌మ‌లం కూడా స్టార్ట్ చేసింది బీజేపీ.. అయితే ఇటు అధికారంలో ఉన్న నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటే క్రెడిట్ ఎక్కువ‌గా ఉంటుంది అని ఆలోచ‌న‌లో ఉంది బీజేపీ.
 
అయితే కాస్త త‌మ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకుంటే మంచిద‌ని... అవినీతి మ‌ర‌క‌లు వివాదాల‌కు దూరంగా ఉండే నాయ‌కులను  సెల‌క్ట్ చేసుకుంటోంది బీజేపీ.. ఆ జాబితాలో ఉత్త‌రాంధ్రా సీనియ‌ర్ నాయ‌కుడు కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కు బీజేపీ ఓ మంచి ఆఫ‌ర్ ఇచ్చింది అనే వార్త‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.
 
ఆయ‌న కేంద్ర మంత్రిగా తెలుగుదేశం- బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎన్డీయేలో మొద‌టినుంచి కొన‌సాగుతున్నారు.. కేంద్ర పౌర‌ విమాన‌యాన‌ శాఖ మంత్రి అశోక్‌ గ‌జ‌ప‌తిరాజుకి నార్త్  స్టేట్ లో ఓ స్టేట్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తాము అనే ఆఫ‌ర్ ఇచ్చార‌ట... అయితే జిల్లాలో ఆ కుటుంబానికి రాజ‌కీయంగా మంచి పేరు ఉండ‌టంతో ఆ ఫ్యామిలీ ఎక్క‌డ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డినా విజ‌యం వ‌రిస్తుంది అనే పేరు ఉంది.. పైగా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అని గ‌తంలో చెప్పారు... అందుకే మోదీ అమిత్ షా ఆయ‌న కుమార్తెకు ఎంపీ టికెట్ పార్టీ త‌ర‌పున ఇస్తాము  అంటున్నార‌ట.. ఇటీవ‌ల  ఈ విష‌యం పై చ‌ర్చ జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా వారి కుటుంబానికి విజ‌యం త‌థ్యం అందుకే మోదీ అమిత్ షా ఈ స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నారు అని వార్తలు వ‌స్తున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.