జ‌గ‌న్ తో మాధ‌వ రెడ్డి కీల‌క భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 05:06:27

జ‌గ‌న్ తో మాధ‌వ రెడ్డి కీల‌క భేటీ

ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని బుధ‌వారం నాడు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాదం మాధ‌వ రెడ్డి క‌ల‌వ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.
 
వ‌చ్చే నెల జ‌గ‌న్ పాద‌యాత్ర ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వేశించ‌నుంది. దీంతో అక్క‌డ పాద‌యాత్ర నిర్వ‌హ‌ణ‌పై జ‌గ‌న్ తో మాధ‌వ రెడ్డి చ‌ర్చించారు. ఇటీవ‌ల జ‌రిగిన వాక్ విత్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మం ద‌ర్శిలో విజ‌య‌వంతం కావ‌డంపై జ‌గ‌న్, మాద‌వ‌రెడ్డిని అభినందించారు. 
 
ఇక ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో గ‌త కొన్ని రోజులుగా సందిగ్ద‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. బూచెప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఫ్యామిలీ రాజ‌కీయ భ‌విత్యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికైతే మాధ‌వ రెడ్డి ద‌ర్శి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కూడా మాధ‌వ రెడ్డినే పోటీ  చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ క్ర‌మంలో జ‌గ‌న్ తో మాద‌వ రెడ్డి భేటీపై ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.