బాబు లేని స‌మ‌యంలో బాల‌య్య ఇదేం ప‌ని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 05:41:55

బాబు లేని స‌మ‌యంలో బాల‌య్య ఇదేం ప‌ని

తెలుగుదేశం పార్టీనాయ‌కుడు.. న‌టుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏది చేసినా సంచ‌ల‌న‌మే.. ఆయ‌న వ్య‌వ‌హ‌రశైలి ఎలా ఉంటుంది అనేది ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే... తాజాగా లేపాక్షి పుస్తకాల అంశంపై విజ‌య‌వాడలోని సీయం క్యాంప్‌ కార్యాల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈ స‌మీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఏకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుర్చీలో కూర్చోన్నారు.. దీంతో అధికారులు అంద‌రూ అవాక్క‌య్యారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ గ‌తంలో ఎన్నోసార్లు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద నాకు వ్యామోహం లేద‌ని చెప్పారు... ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వ‌స్తుంటే, ఆ స‌మీక్షలో పాల్గోన్న మంత్రి దేవినేని ఉమా కూడా దీనిపై స్పందించ‌లేదు.

. అయితే దీనిపై తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. గ‌తంలో ఎన్టీఆర్ వ్య‌వ‌హారం గుర్తు తెచ్చుకుంటున్నారు.. ఇటు దావోస్ ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ కూడా వెళ్ల‌డం ఇక్క‌డ ఏపీ ప‌రిపాల‌న ఎవ‌రికి అప్ప‌గించారు అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.. అయితే బాల‌య్య అభిమానులు మాత్రం మా బాల‌య్య‌కే అప్ప‌గించారు అందుకే ఆయ‌న ఆ కుర్చీలో కూర్చున్నారు అని కామెంట్లు చేస్తున్నారు సోష‌ల్ మీడియాలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.