ఫిరాయింపుల‌కు విష్ణుకుమార్ రాజు పంచ్ లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 11:40:43

ఫిరాయింపుల‌కు విష్ణుకుమార్ రాజు పంచ్ లు

తెలుగుదేశం పార్టీ అనైతికంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశంలో చేర్చుకోవ‌డ‌మే కాకుండా, పార్టీ ఫిరాయించిన నాయ‌కుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం పై ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.. తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన నాయ‌కులే జ‌గ‌న్ పై అనేక కామెంట్లు చేస్తూ పార్టీలో సీనియ‌ర్లు గా చెలామ‌ణి అవుతున్నారు.. అయితే ప్ర‌జాక్షేత్రంలో వారు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లోకి వ‌స్తే వారికి అప‌జ‌యం త‌థ్యం అంటున్నారు వైసీపీ నాయ‌కులు.
 
ఇక గ‌వ‌ర్న‌ర్ పై కామెంట్లు చేసి కాస్త వార్త‌ల్లో నిలుస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. తాజాగా ఆయ‌న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై వేటు వేయాల‌ని అన్నారు... పార్టీ మారిన నాయ‌కులు నిజంగా ఆ పార్టీ పై ఇష్టం లేక‌పోతే, ఆ పార్టీలో ఉండ‌లేక‌పోతే రాజీనామా చేసి మ‌ర‌లా వేరే పార్టీ గుర్తుపై గెలిచి స‌భ‌లోకి రావాలి అని ఆయ‌న హిత‌వు ప‌లికారు.
 
అలాగే పార్టీ మారిన వారికి మంత్రి ప‌దవులు సీఎం చంద్ర‌బాబు  ఇవ్వ‌డం కూడా మంచి ప‌రిణామం కాద‌ని, ఇది రాజ‌కీయ నైతిక‌త కాద‌ని అన్నారు విష్ణుకుమార్ రాజు.. . లేకపోతే ఏ పార్టీ గుర్తుపై గెలిచినా? మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు స‌టైర్ వేశారు.. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తెలుగుదేశం నాయ‌కుల మాత్రం నో కామెంట్ అంటున్నారు.. దీనికి కార‌ణం కూడా ఉంది.. బాబు గ‌తంలోనే చెప్పారుగా,  బీజేపీ కామెంట్ల పై ఎటువంటి స‌మాధానాలు ఇవ్వద్దు అని అది తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.