రేపు కోర్టుకు సెల‌వ్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 03:34:16

రేపు కోర్టుకు సెల‌వ్...

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుండి విశేష‌మైన  స్పంద‌న వ‌స్తోంది. యాత్రలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూనే ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ముందుకు సాగుతున్నారు. 
 
కేసులో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌తి శుక్ర‌వారం పాద‌యాత్ర‌కు బ్రేక్  ఇస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ శుక్ర‌వారం మాత్రం కోర్టుకు సెల‌వు ఉంది. ఈ క్ర‌మంలో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తారా...లేదా అనే దానిపై గంద‌ర‌గోళం నెల‌కొంది. 
 
కోర్టుకు సెల‌వు ఉన్న‌ప్ప‌టికీ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ బ్రేక్ ఇస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. పోలీసులు సెల‌వు కావాల‌ని అడ‌గ‌డంతో జగ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ నిర్ణ‌యం తీసుకున్నాని వారు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.