ఏపీని ముంచేసిన కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 04:49:41

ఏపీని ముంచేసిన కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి సీమాంధ్రను చావు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ రాష్ట్రానికి విభ‌జ‌న బిల్లులో రెవెన్యులోటు భ‌ర్తీ, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వేజోన్ ఏర్పాటు, ప్ర‌త్యేక‌హోదాతో పాటు ఇత‌ర కేంద్ర సంస్థ‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హ‌మీఇచ్చింది అప్ప‌టి కేంద్ర‌ ప్ర‌భుత్వం.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్షాలైన‌ టీడీపీ-బీజేపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించి అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నేర‌వేర్చ‌డంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌లం అయ్యాయి. అందువ‌ల్ల ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

తాజాగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయలేమని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎన్ఐడిఎం, రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే క‌నీసం నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు, రాష్ట్రానికి కొంత మేర‌ ఆదాయం వ‌చ్చి ఉండేది. మొత్తంగా ఏపీని ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, అటు కేంద్ర ప్ర‌భుత్వం మోసం చేస్తూనే వ‌స్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.