బీజేపీ పై బాబు మ‌ళ్లీ యూ ట‌ర్న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 04:55:46

బీజేపీ పై బాబు మ‌ళ్లీ యూ ట‌ర్న్

మొత్తానికి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు దావోస్ ప‌ర్య‌ట‌న దిగ్విజ‌యంగా పెట్టుబ‌డుల వ‌ర‌ద‌తో పూర్తి అయింద‌ని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.. దీనిపై తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు కూడా త‌న ప‌ర్య‌ట‌న విశేషాల‌ను తెలియ‌చేశారు.

తన దావోస్‌ పర్యటన గతంకంటే భిన్నంగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో ప్రయోజనకారిగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా సింగపూర్ నుంచి 50సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయని వివరించారు.. వినూత్న ఆవిష్కరణల వేదికగా విశాఖపట్నంలో మెడ్ టెక్ సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీగా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు... ఆలీబాబా సంస్థ తమ రెండో డేటా సెంటర్‌ను రాష్ట్రంలో పెట్టనుందని, అలాగే మహీంద్రాతో పాటు ఎయిర్ బస్ సంస్థల నుంచి సానుకూల స్పందన వచ్చిందని చంద్రబాబు వివరించారు.

ఇక బీజేపీ నాయ‌కుల‌పై కాస్త విమ‌ర్శ‌ల‌ను త‌గ్గించిన తెలుగుదేశం పార్టీ... మ‌రోసారి త‌మ వెర్ష‌న్ తెలిపింది. తెలుగుదేశం నాయ‌కుల‌పై బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డంపై బాబు స్పందించారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, వారు మిత్రపక్ష ధర్మంపై ఒక‌సారి ఆలోచించుకోవాలని తెలిపారు....బీజేపీ నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా తమ నాయ‌కులను విమ‌ర్శ‌లు చేయ‌కుండా నియంత్రిస్తున్నాం అని అన్నారు సీఎం.. వాళ్లు ఒక‌వేళ వ‌ద్దంటే న‌మ‌స్కారం పెట్టి త‌మ ప‌ని తాము చూసుకుంటామ‌ని అన్నారు చంద్ర‌బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.