బాల‌య్య ఫ్రెండ్ కు తేల్చి చెప్పిన బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 05:10:16

బాల‌య్య ఫ్రెండ్ కు తేల్చి చెప్పిన బాబు

వ‌చ్చే ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతోంది... ఇటు జగ‌న్ స్పీడును అందుకోవ‌డంలో సైకిల్ పార్టీ నాయ‌కులు వెనుకే ఉంటున్నారు... బాబు అస‌లు పార్టీని గాడిలో పెట్టాలి అని ఇంకా ఆలోచ‌న‌లు చేస్తూనే ఉన్నారు...గ‌తంలో మంత్రి ప‌ద‌వి రాక‌పోతేనే ఇలా ర‌చ్చ చేసిన నాయ‌కులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌క‌పోతే ఇంకెంత ర‌చ్చ చేస్తారో అని తెలుగుదేశంలో నాయ‌కులు కూడా చ‌ర్చించుకుంటున్నారు.
 
అందుకే స‌ర్వేలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ లు అంటూ బాబు తెర‌పైకి కొత్త డ్యాష్ బోర్డ్ త‌రహా రాజ‌కీయాలు తెస్తున్నారు. నెల‌కోసారి స‌ర్వే-  15 రోజుల‌కోసారి రివ్యూ మీటింగుల‌తో నాయ‌కుల‌కు హ‌డ‌ల్ తెప్పిస్తున్నారు బాబు.. పార్టీలో వ‌చ్చే గ్రాఫ్ లు బ‌ట్టీ,  నాయ‌కుల‌కు త‌న దైన రీతిలో వార్నింగ్ లు ఇస్తున్నారు బాబు.
 
తాజాగా ఓ వార్త వైర‌ల్ అవుతోంది తెలుగుదేశం స‌ర్కిల్స్ లో.. బాల‌య్య‌కు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు అంటే పాలిటిక్స్ లో క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబురావు గుర్తువ‌స్తారు.. క‌దిరి స‌ర్వే రిపోర్టులు పొంత‌న లేవ‌ట, గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికీ స‌గానికి సైతం ఎమ్మెల్యే గ్రాఫ్ ప‌డిపోయింద‌ని తెలిపారట‌.
 
2009 - 2014 లో బాల‌య్య చెప్ప‌డంతో బాబు టికెట్ ఇచ్చారు.. 2009 లో నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణతో ఆయ‌న వెనుదిరిగారు... ఈ సారి మాత్రం బాల‌య్య‌, లోకేశ్, దేవాన్ష్ , రిక‌మెండేష‌న్స్ పని చేయ‌వ‌ని తేల్చి చెప్పార‌ట‌. పార్టీ పై ప‌ట్టురావాలి అంటే నువ్వు నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లాలి అని, అక్క‌డ ప్ర‌జ‌ల స‌మ‌స్యలు తెలుసుకోవాలి అని చెప్పార‌ట మొత్తానికి బాల‌య్య‌ని ఫాలో అవుతున్నారు బాబురావు అని అంటున్నారు నాయ‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.