రామోజీ కోడలిపై చీటింగ్ కేసు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 05:13:58

రామోజీ కోడలిపై చీటింగ్ కేసు

ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు కోడ‌లు శైల‌జాకిర‌ణ్ పై 420 కేసు న‌మోదు అయింది. శైల‌జా కిర‌ణ్ మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ ఎండీగా ఉన్నారు. అయితే మార్గ‌ద‌ర్శి సంస్థ ఉద్యోగే ఆమెపై కేసు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

సంత‌కాలు ఫోర్జ‌రీ వ్య‌వ‌హారంలో శైల‌జా కిర‌ణ్ పై కేసు న‌మోదైంది. ముందు ఆమెపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాక‌రించ‌డంతో సంగీత అనే మార్గ‌ద‌ర్శి చిట్ ఫంట్ ఉద్యోగి నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించింది. త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి అక్ర‌మ అటాచ్ మెంట్ చేశారంటూ సంగీత కోర్టుకు తెలిపింది.

నాంప‌ల్లి కోర్టు శైలజాకిర‌ణ్ పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించ‌డంతో ఆమెతో పాటు సంస్థ ఉద్యోగులు పార్ధ‌సార‌థి. సంపత్‌, చిట్‌ఫండ్ కంపెనీపైనా ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.