బాబుకు వ‌ణుకు జ‌గ‌న్ చురుకు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 02:48:56

బాబుకు వ‌ణుకు జ‌గ‌న్ చురుకు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన వాక్ విత్ జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా అశేష జ‌న‌వాహినితో ముందుకు న‌డుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో పెద్ద ఎత్తున జ‌నం పాలు పంచుకుంటున్నారు.. జ‌గ‌న్ తో న‌డిచేందుకు నెల్లూరులో ఆయ‌న వెంట ప‌లుచోట్ల నుంచి పాద‌యాత్ర‌లో అభిమానులు పాల్గొంటున్నారు... అలాగే జ‌గ‌న్ కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి విన్న‌పాలు అందుతున్నాయి... తెలుగుదేశం హాయాంలో జ‌రుగుతున్న అవినీతి పాల‌న‌ను త‌రిమికొట్టేందుకు జ‌గ‌న్ రావాలి అనే స్లోగ‌న్స్ వ‌స్తున్నాయి ప్ర‌జ‌ల నుంచి.

వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతున్నదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.... ఆయ‌న వేలాది మందితో కలిసి !! వాక్‌ విత్‌ జగనన్న !! కార్యక్రమంలో పాల్గొన్నారు. ప‌లువురు నాయకులు ఆయ‌న‌తో క‌లిసి న‌డిచారు.. రాష్ట్రంలో జ‌గ‌న్ కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి చంద్రబాబు, తెలుగుదేశం నాయ‌కులు వ‌ణికిపోతున్నారు అని ఆయ‌న అన్నారు.. ఇక జ‌గ‌న్ చురుగ్గా రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అవుతూ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నారు అని అన్నారు వైసీపీ నాయ‌కులు.

జ‌గన్ కు ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో టీడీపీ ప్ర‌భుత్వానికి అంతిమ గ‌డియ‌లు ప్రారంభం అవుతున్నాయి అని ఆయ‌న అన్నారు... జిల్లాలో వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున వాక్ విత్ జ‌గ‌న్ అన్న కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేశారు. చిత్తూరు జిల్లాలోని నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా !! వాక్‌ విత్‌ జగనన్న!! కార్యక్రమం నిర్వహించారు.పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తవణంపల్లిలో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఆధ్యర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు.. తాజాగా చిత్తూరు లో పాద‌యాత్ర ముగించుకుని నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న‌విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.