అలా చేస్తే జ‌గ‌న్ జైలుకు వెళ‌తారు నారాయ‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 12:49:35

అలా చేస్తే జ‌గ‌న్ జైలుకు వెళ‌తారు నారాయ‌ణ‌

ఇటు తెలుగుదేశం నాయ‌కులు నోరు విప్పితే జ‌గ‌న్ ల‌క్ష కోట్లు అనే పదం మాత్ర‌మే వినిపిస్తారు.. బ‌హుశా జ‌గ‌న్ నామ జ‌పంతోనే తెలుగుదేశం నాయ‌కులు త‌మ ప్ర‌జా సేవ‌ను కొన‌సాగిస్తున్నారు అన‌డంలో, అతిశ‌యోక్తి లేదు.. జ‌గ‌న్ పేరు చెబితే ల‌క్ష కోట్ల పేరు మాత్ర‌మే వినిపిస్తుంది తెలుగుదేశం నుంచి... ఇటు జ‌గ‌న్ వైపు నుంచి బాబుకు ఇచ్చే పేరు  18 స్టేలు అంటారు.. అయితే తెలుగుదేశం నాయ‌కులు మాత్రం బాబుకు ఎటువంటి నెగిటివ్  ఫేమ్ రాకుండా చూస్తారు..  తెలుగుదేశం నాయ‌కులు మాత్రం  అనేక సంద‌ర్బాల‌లో బాబు అంత సీనియ‌ర్ నాయ‌కుడు దేశంలో లేరు అంటారు.. ఓ మాణిక్ స‌ర్కార్, ఓ న‌వీన్ ప‌ట్నాయ‌క్, ఓ జ్యోతి బ‌సు లాంటి సీనియ‌ర్లు కూడా బాబు త‌ర్వాతే అంటారు కొంద‌రు సీనియ‌ర్లు.
 
ఇక తెలుగుదేశం అంటేనే పొత్తుల రాజ‌కీయం అంటారు.. తొమ్మిది సంవ‌త్సరాలు బాలు పాల‌న విజ‌యం అంతా ఇదేపందాలో కొన‌సాగింది.. అయితే తెలుగుదేశం నాయ‌కులు మాత్రం బాబుఫేమ్ తోనే ఈ విజ‌యం అంటారు. తాజాగా వ‌చ్చే  ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ లో అధికారంలో  ఉన్న బీజేపీ  ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంది అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.. ఈ స‌మయంలో జ‌గ‌న్ బీజేపీతో క‌లిసి వెళ్లే  అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.. ఇక తెలుగుదేశం క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి జ‌త‌క‌ట్టిన  రోజులు అనేకం చూశారు ప్ర‌జ‌లు.. ఏపీలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏమిటి అనేది ఇంకా ఎటువంటి నిర్ణ‌యం వారు తీసుకోలేదు.. ఎక్కువ‌గా జ‌న‌సేన వైపు వీరు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
 
తాజాగా కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు...మోదీ మెప్పు కోసమే ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ సీఈసీ సిఫారసు చేసిందని  ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న న‌ర‌సింహ‌న్ పై కూడా ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.
 
ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలనుకుంటే ఏపీ, తెలంగాణలో పార్టీలు ఫిరాయించి మంత్రులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.. ముందు ఇక్క‌డ అధికార పార్టీలు చేస్తున్న రాజ‌కీయాల‌ను  ఎందుకు  ప‌ట్టించుకోవ‌డం లేదు అని అన్నారు.
 
సీబీఐ విధానాలను కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.... కేంద్రానికి పెంపుడు కుక్కలా  సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన నారాయణ.. విభజన హామీల సాధనకు చంద్రబాబు కోర్టుకెళ్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కమ్యూనిస్టులతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.