టీడీపీ ఆ ఫ్యామిలీకి దూరం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 02:13:37

టీడీపీ ఆ ఫ్యామిలీకి దూరం ?

రాజ‌కీయం అంటేనే ఓ పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంపింగ్ అనే విధానానికి వ‌చ్చింది ఏపీలో తెలంగాణ‌లో... పార్టీ ఫిరాయింపుల త‌ర్వాత ఇప్పుడు మ‌రింత పేరు వ‌చ్చింది తెలుగు రాష్ట్రాల‌కు.. అయితే పార్టీ ఫిరాయింపులు కాకుండా రాజీనామా చేసి న‌చ్చిన పార్టీలోకి వెళ్లే జంపింగ్ లు ఉన్నారు.. విజ‌యవాడ రాజ‌కీయాల్లో దేవినేని ఫ్యామిలీకి ఓ క్రేజ్ ఉంది.. అయితే దేవినేని నెహ్రూ మ‌ర‌ణం త‌ర్వాత ఆ క్రేజ్ కాదు ఆ పేరు ఇప్పుడు వినిపించ‌డం లేదు.. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు విజ‌య‌వాడ అట్టుడికిపోయిన స‌మ‌యంలో కీల‌క నాయ‌కులుగా ఉండేవారు వీరు.. అయితే ఇప్పుడు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయం విజ‌య‌వాడ నుంచి దూరం అయిపోయింది. ఈ నాయ‌కులు దూరం అయ్యారు.

విజ‌య‌వాడ‌లో దేవినేని వ‌ర్సెస్ వంగ‌వీటి రాజ‌కీయం రాష్ట్రం అంతా తెలిసిందే... ఇక తెలుగుదేశంలో త‌న ప్ర‌స్ధానం మొద‌లు పెట్టిన దేవినేని, త‌ర్వాత పార్టీలో వ‌చ్చిన వివాదాల‌తో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఇక కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి 2014 ఎన్నిక‌ల్లో దేవినేని ఫ్యామిలీ వ‌చ్చింది, నాలుగుసార్లు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఓ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా దేవినేని రాజ‌కీయం విజ‌య‌వాడ‌లో ఓ శ‌కంలా జ‌రిగింది.

2009,2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఓట‌మి వ‌చ్చింది... ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఆ స‌మ‌యంలో ఎదురుదెబ్బ అనే చెప్పాలి ఈ రెండు ప‌ర్యాయాలు.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు అవినాష్ ను ఎంపీగా కూడా పోటీ చేయించి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.. అయితే ఈ స‌మ‌యంలో ఆయ‌న చాలా కుంగిపోయారు అని ఆయ‌న అనుచరులు బాధ‌ప‌డిన సంద‌ర్బాలు ఉన్నాయి.

త‌రువాత ఆయ‌న త‌నకు రాజ‌కీయ ఓన‌మాలు దిద్దిన తెలుగుదేశం పార్టీలోకి త‌న కుమారుడితో స‌హా వ‌చ్చేశారు. కాని పార్టీలోకి తిరిగి వ‌చ్చినా, సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌ను న‌మ్మి ఎటువంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు, అయినా తెలుగుదేశంలోనే కొన‌సాగారు దేవినేని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి రాజ‌కీయంగా ప్లాట్ ఫాం క‌ల్పించాలి అని ఆయ‌న చంద్ర‌బాబును కోరారు.. ఈ లోపు ఆయ‌న హఠాన్మ‌ర‌ణంతో దేవినేని ఫ్యామిలీకి రాజ‌కీయ అస్ధిర‌త చుట్టుకుంది. దీంతో ఇప్పుడు దేవినేని అవినాష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

అయితే నెహ్రూ ఫ్యామిలీకి పెన‌మ‌లూరు కంచుకోట, అక్క‌డ నుంచి నెహ్రూ త‌న కుమారుడిని ఎమ్మెల్యేగా నిల‌బెడ‌దామ‌ని అనుకున్నారు.. అయితే ఇటు పార్టీలో ఈ సెగ్మంట్ నుంచి లోకేశ్ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారు అనే వార్త‌లు రావ‌డంతో, అవినాష్ కు టిక్కెట్ ద‌క్క‌దు అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.. ఇటు విజ‌య‌వాడ సెగ్మెంట్ల‌లో సిట్టింగ్ లు త‌మ సీటుకు ఇప్ప‌టి నుంచే హామీలు తీసుకుంటున్నారు... దీంతో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే అవినాష్ కు సీటు ద‌క్కుతుంది అని, లేక‌పోతే క‌ష్టం అనే వార్త‌లు తెలుగుదేశంలో విజ‌య‌వాడ పొలిటిక‌ల్ కారిడార్లో వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.