జ‌గ‌న్ చెంత‌కు మ‌రో బ‌డా నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 06:22:19

జ‌గ‌న్ చెంత‌కు మ‌రో బ‌డా నేత

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. ఆ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఇప్ప‌టికే అనేక‌మంది ఇత‌ర పార్టీ  ముఖ్య నేత‌లు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడు మ‌రో బ‌డా నేత వైయ‌స్ జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
రాజంపేట మాజీ కేంద్ర మంత్రి సాయి ప్ర‌తాప్  త్వ‌ర‌లో వైసీపీలో చేరేందుకు సిద్ద‌మైన‌ట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల సాయి ప్రతాప్  మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం గుప్పించారు. టీడీపీలో కొన‌సాగుతున్న సాయి ప్ర‌తాప్ అనూహ్యంగా జ‌గ‌న్ ను పొగ‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి సాయి ప్ర‌తాప్ అత్యంత స‌న్నిహితుడైన్న‌ప్ప‌టికి ప‌లు రాజ‌కీయ కార‌ణాల చేత టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీ వైపు ప్ర‌తాప్ చూపు ప‌డిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇందులో నిజ‌మెంత అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.