ఆట మొద‌లైంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 10:50:37

ఆట మొద‌లైంది

రాయ‌ల‌సీమ..... రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు ఒక‌లా కొన‌సాగితే....సీమ‌లో మ‌రోలా సాగుతాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయాలు హీటెక్కాయి. రాయ‌ల‌సీమ వాదాన్ని గంగ‌లో క‌లిపేసి రాజ‌కీయ పార్టీ వైపు మొగ్గు చూపి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యేందుకు బైరెడ్డి సిద్ద‌మైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

దీంతో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. తాజాగా జిల్లాలో ర‌ఘురామి రెడ్డి అనే ఓ కీల‌క నేత హ‌త్యాయ‌త్నంతో క‌క్ష్య‌రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ర‌ఘురామి రెడ్డి హ‌త్యాయ‌త్నంపై ఇటు బైరెడ్డి, అటు వైసీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది.

ర‌ఘురామి రెడ్డి హ‌త్యాయ‌త్నానికి మీరంటే మీరే కార‌ణమంటూ బైరెడ్డి వ‌ర్గం, గౌరు ఫ్యామిలీ వ‌ర్గంతో పాటు టీడీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు నిందలు వేసుకుంటున్నారు. ఈ హ‌త్యాయ‌త్నంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలంటూ బై రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో బై రెడ్డి పార్టీకి 154 ఓట్లు రావడం, గత పాణ్యం ఎన్నికల్లో కూతురు శివానికి 500 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్‌ను కోల్పోవడంతో బై రెడ్డిని ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌రిచిపోయార‌నే విష‌యం అందరికీ అర్ధ‌మ‌వుతూనే ఉంద‌ని గౌరు చ‌రితా రెడ్డి మండిప‌డ్డారు.

బై రెడ్డి త్వ‌ర‌లో టీడీపీలో చేరే తేదీని ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు. దీంతో మ‌రోసారి బై రెడ్డి, గౌరు ఫ్యామిలీకి మ‌ధ్య రాజ‌కీయ క్రీడ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శాంతి యుతంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుని రాజ‌కీయాల‌ను కొన‌సాగించే దిశ‌గా ఈ రెండు వ‌ర్గాలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, లేని ప‌క్షంలో అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లి అయ్యే పరిస్ధితి వ‌స్తుంద‌ని కొందరు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.