ముస్త‌ఫా క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 11:13:39

ముస్త‌ఫా క్లారిటీ

గుంటూరు తూర్పు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే ముస్తఫా తాజాగా ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌ల‌వ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.  టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు తో క‌లిసి ముస్త‌ఫా  అనూహ్యంగా సీఎం తో స‌మావేశం అయ్యారు. 
 
దీంతో ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్లు  మీడియాలో జోరుగా ప్ర‌చారం మొదలైంది. గ‌తంలో కూడా అనేక మంది వైకాపా ఎమ్మెల్యేల‌పై కూడా పార్టీ మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో కొందరు సైకిల్ ఎక్క‌గా మ‌రి కొంద‌రు పార్టీ మార‌టం లేదంటూ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ క్ర‌మంలో ముస్తఫా కూడా పార్టీ మార్పుపై స్పందించారు. టీడీపీ ఎంపీ  రాయ‌పాటి సాంబ‌శివ రావు త‌న గురువు అని ఆయ‌న‌తో క‌లిసి చంద్ర‌బాబును క‌లిశాను... అయితే ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది గురించి మాత్ర‌మే చ‌ర్చించాన‌ని ముస్త‌ఫా స్ప‌ష్టం చేశారు. 
 
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన జగన్‌ను వీడి వెళ్లిపోయే క్యారెక్టర్‌ తనది కాదని ఆయ‌న అన్నారు. ప్రాణమున్నంత వరకు వైయ‌స్ జగన్‌తోనే తన  రాజ‌కీయ  ప్రయాణం ఉంటుందన్నారు. ప్ర‌స్తుతం  వైసీపీలో తనకు ఎలాంటి లోటు లేదని..టీడీపీలోకి ఎందుకు వెళ్తానని ఆయన ప్రశ్నించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.