నెల్లూరులో రేపు న‌యా పాద‌యాత్ర I

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 06:16:07

నెల్లూరులో రేపు న‌యా పాద‌యాత్ర I

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ నెల 23 వ తేదిని నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది.. ఈ విష‌యాన్ని వైసీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట నియోజ‌క‌వ‌ర్గంలోకి పాద‌యాత్ర మంగ‌ళ‌వారం ప్ర‌వేసిస్తుంది అని తెలియ‌చేశారు వైసీపీ నాయ‌కులు.. నెల్లూరు జిల్లాలోని తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగ‌నుంది..
చివ‌రికి ఉదయగిరి నియోజకవర్గంతో నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర ముగుస్తుంది అని, అక్క‌డ నుంచి ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర స్టార్ట్ అవుతుంది అని వైసీపీ నాయ‌కులు తెలియ‌చేశారు.
 
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రవేశిస్తుందని వైసీపీ నాయ‌కులు తెలిపారు. జిల్లాలో జ‌గ‌న్ కు స్వాగ‌తం ప‌లికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇక ఈ నెల 24 వ తేదిన నాయుడుపేట‌కు పాద‌యాత్ర చేరుకుంటుంది అని, అక్క‌డ బ‌హిరంగ‌స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తార‌ని జిల్లా నాయ‌కులు తెలియ‌చేశారు..  అక్కడి నుంచి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల వరకు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.