బాబుకు జ‌గ‌న్ అదిరిపోయే కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 10:51:02

బాబుకు జ‌గ‌న్ అదిరిపోయే కౌంట‌ర్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చిత్తూరు జిల్లాలో కొన‌సాగుతోంది.. ఈ సంద‌ర్బంగా 900 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు అడుగు అడుగునా.. ఇక ఏపీకి ఎటువంటి అన్యాయం జ‌రిగినా స‌హించేది లేదు అని, అవ‌స‌ర‌మైతే సుప్రీం కోర్టుకు వెళ‌తా అని  ఇటీవ‌ల  చంద్ర‌బాబు చేసిన కామెంట్ల పై, జ‌గ‌న్ త‌న గ‌ళం విప్పారు.. ఎటువంటి మాటలు  చంద్ర‌బాబు మాట్లాడుతున్నారో చూడాలి అని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేశారు జ‌గ‌న్.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు. ప్ర‌త్యేక  హోదాను కేంద్రానికి తాక‌ట్టుపెట్టార‌ని ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగ‌డకు బాబు తెర‌లేపార‌ని ఆయ‌న  విమ‌ర్శించారు.. కేంద్రంలో మీ ఎంపీలు మంత్రులుగా కొన‌సాగుతున్నారు ఇలాంటి స‌మ‌యంలో మీరు కోర్టుకు ఎవ‌రిపై వెళతారు అని జ‌గన్ ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల‌ను కొత్త‌గా మోసం చేయ‌డానికి చంద్ర‌బాబు కొత్త అధ్యాయానికి తెర‌లేపారని జ‌గ‌న్ విమ‌ర్శించారు..చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయ‌న ఈ విమ‌ర్శ‌లు చేశారు... వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో వచ్చిన ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయించడం లేదని చంద్రబాబును నిగ్గదీశారు జ‌గ‌న్. తమ స‌ర్కారు వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రికి మంచి జ‌రుగుతుంద‌ని. స‌ర్కారు  ప‌థ‌కాలు అంద‌రికి వ‌ర్తించేలా చేస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు... న‌ల్ల‌ధ‌నం దాచుకోవ‌డానికి ఇత‌ర దేశాల‌కు చంద్ర‌బాబు వెళ‌తార‌ని జ‌గ‌న్ ఎద్దెవా చేశారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.