జ‌గ‌న్ స‌రికొత్త రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 11:16:08

జ‌గ‌న్ స‌రికొత్త రికార్డ్

టీడీపీ దుష్ట ప‌రిపాల‌న‌ను ఎదుర్కొంటూ, అధికారపార్టీ పెట్టే ప్ర‌లోభాల‌తో త‌న పార్టీని నీరుగారుస్తున్నా భ‌రిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లను సొమ‌వారం అధిగ‌మిస్తోంది. ఈ సంద‌ర్బంగా జగనన్నతో కలిసి నడుద్దాం అంటూ !! వాక్‌ విత్‌ జగనన్న!! అనే కార్యక్రమాన్ని తెలుగునాట ఏర్పాటు చేస్తోంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఈ కార్య‌క్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల‌లో భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ శ్రేణులు. గ‌త యేడాది న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ ఘాట్ నుంచి మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర అంద‌రికి తెలిసిందే. ప్రజా సంకల్ప పాదయాత్ర రాయ‌ల‌సీమ జిల్లాల్లో దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుని... గ‌త‌వారం నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది.. ఈ జిల్లాలో సైదాపురం మండలంలో 1000 కిలోమీటర్ల యాత్రను జగన్‌ పూర్తిచేయ‌నున్నారు. వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమాన్ని ప్ర‌తీ జిల్లా, నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యవంతం చేయ‌డానికి వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్ప‌టికే బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా ర్యాలీలు చేస్తూ వాక్ విత్ జ‌గ‌న్ అనే స్లోగ‌న్స్ ఇచ్చారు వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ అభిమానులు.

వాక్‌ విత్‌ జగనన్న కార్య‌క్ర‌మం ద్వారా న‌వ‌ర‌త్నాల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌నున్నారు వైసీపీ కార్య‌క‌ర్త‌లు. నెల్లూరు జిల్లాలో నేడు జగన్‌ 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే ప్రదేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ప‌లు రాష్ట్రాల్లో ఆదివార‌మే వాక్‌ విత్‌ జగనన్న కార్య‌క్ర‌మం జ‌రుపుకున్నారు జ‌గ‌న్ అభిమానులు. ఇత‌ర దేశాల్లో ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల్లో ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం జరిగింది. ఇది జ‌గ‌న్ రికార్డ్ గా ఆయ‌న అభిమానులు తెలుపుతున్నారు ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ కు ఉన్నా మ‌ద్ద‌తు చూసి తెలుగుదేశం ప్ర‌భుత్వం జ‌గ‌న్ పై ఆయ‌న పార్టీ పై కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.