జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 05:15:52

జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.  ప్ర‌జాసంకల్ప పాద‌యాత్రలో భాగంగా ప్ర‌స్తుతం జ‌గ‌న్ నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. పాద‌యాత్ర 1000 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు మీడియా సంస్ధ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వడం జ‌రిగింది. 
 
ఓ ఇంట‌ర్వ్యూలో  మాట్లాడుతూ...  ఆవేశంలో కొన్ని స‌మ‌యాల్లో పొర‌పాట్లు చేస్తుంటార‌ని,  అలాంటి వారు వారి త‌ప్పును తెలుసుకుని తిరిగి వ‌స్తే అభ్యంత‌రం లేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ తిరిగి వైసీపీలోకి వ‌చ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్  ఇచ్చారు. అయితే వారిపై పూర్తి న‌మ్మ‌కం క‌లిగితేనే పార్టీలోకి తీసుకుంటామ‌ని చెప్ప‌కొచ్చారు జ‌గ‌న్. 
 
ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఇస్తూ వ‌స్తున్న హామీల‌పై ఆయ‌న  త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్ర‌క‌టిస్తున్న ప్ర‌తి హామీపై త‌న‌కు స్ప‌ష్ట‌మైన అవగాహ‌న ఉంద‌ని అన్నారు. అమలు సాధ్య‌మ‌య్యే హామీల‌నే  ప్ర‌క‌టిస్తున్నాన‌ని తెలిపారు. ఇక  చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై  తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్.. .పొత్తు విష‌యంపై ఎన్నిక‌ల నాటికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
మ‌రి  ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డి నియోజ‌క‌వ‌ర్గ  అభివృద్ది పేరు చెప్పుకుని,  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ఎలాంటి ఆలోచ‌న చేస్తారో చూడాలి. అయినా  పార్టీని మోసం చేసి  జంప్ అయిన  అలాంటి వాళ్ల‌ను జ‌గ‌న్  ఇంకా న‌మ్మ‌డం ఏంట‌నేది  ఇప్పుడు కొంద‌రు సంధిస్తున్న మ‌రో ప్ర‌శ్న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.