జ‌ర్న‌లిస్ట్ సాయి స‌వాల్ ను స్వీక‌రించే ద‌మ్ముందా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 10:42:02

జ‌ర్న‌లిస్ట్ సాయి స‌వాల్ ను స్వీక‌రించే ద‌మ్ముందా...?

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకుల‌ను దేశ వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి జెండావంద‌నం చేశారు ప్ర‌జ‌లు. శుక్ర‌వారం నాడు సాయంత్రం గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖ తెలుగు మీడియా ఛానల్ ఏపి 24*7 ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

మిగ‌తా తెలుగు మీడియా ఛాన‌ల్స్ అన్నీ కూడా హైద‌రాబాద్ వేదిక‌గా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఏపీ 24*7 మీడియా ఛాన‌ల్ మాత్రం మొట్ట‌మొద‌టి న‌వ్యాంధ్ర శాటిలైట్ ఛాన‌ల్ నినాదంతో విజ‌య‌వాడ‌లో కొత్త‌గా ఏర్పాటు అయింది. దీంతో అక్క‌డ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకల‌ను నిర్వ‌హించారు. వేడుక‌కు పెద్ద ఎత్తున విజ‌యవాడ ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆ మీడియా చానల్ ఎక్సిక్యూటీవ్ ఎడిట‌ర్ సాయి, ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మిగ‌తా తెలుగు మీడియా ఛాన‌ల్స్ కు స‌వాల్ విసిరారు. ఎక్క‌డో హైద‌రాబాద్ లో ఉంటూ క‌బుర్లు చెప్ప‌డం కాదు.. ఇక్క‌డ ఛాన‌ల్ న‌డిపించే ద‌మ్ము మాకుంది... అదే మీకు ద‌మ్ముంటే విజ‌య‌వాడ‌కు రండి......ఇక్క‌డి స‌మ‌స్య‌ల గురించి, అభివృద్ది గురించి ఇక్క‌గే చ‌ర్చిద్దాం...ప్ర‌శ్నిద్దాం.... అంటూ....సాయి మిగ‌తా ఛాన‌ల్స్ కు దిమ్మ తిరిగే స‌వాల్ విసిరారు.

గ‌తంలో మీడియా విజ‌య‌వాడను ఓ రౌడీల న‌గ‌రంగా చూపించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని రకాల వ‌న‌రులు ఉన్న‌టువంటి న‌గ‌రంగా బెజ‌వాడ అభివృద్దిలో దూసుకుపోతోంద‌ని, అందుకే మిగ‌తా ఛాన‌ల్స్ కూడా రావాల‌ని ఆయ‌న కోరారు.

అభివృద్ది చేస్తుంటే అండ‌గా నిల‌బ‌డ‌తాం... అదే అభివృద్దికి ఆటంకం క‌లిగిస్తే ఎదురిస్తాం ఇదే మా చాన‌ల్ పాల‌సీ అని సాయి త‌న ప్ర‌సంగాని ముగించారు.. మ‌రి టీఆర్ పీ రేటింగ్స్ కోసం నిజంగానే హైదరాబాద్ లో సొల్లు చ‌ర్చ‌లు పెట్టే మిగ‌తా మీడియా ఛాన‌ల్స్ జ‌ర్న‌లిస్ట్ సాయి విసిరిన సవాల్ ను స్వీక‌రిస్తుందా...... ఖ‌చ్చితంగా స్వీక‌రించాల్సిన బాధ్య‌త వారిపై ఉంద‌నేది మా అభిప్రాయం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.