బాబు లీకుల చిట్టా విప్పిన కేవీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 11:24:21

బాబు లీకుల చిట్టా విప్పిన కేవీపీ

త‌నంత సీనియ‌ర్ నాయ‌కుడు లేడు, త‌నంత పొలిటిక‌ల్ నాలెడ్జ్ నాయ‌కుడు లేడు అనేలా అంటారు సీఎం చంద్ర‌బాబు న‌లుదిక్కులా... ఇదే విష‌యాన్ని చాటి చెబుతారు తెలుగుదేశం నేత‌లు... స‌మ‌కాలీన రాజ‌కీయ నాయ‌కుడిగా బాబును పిలుచుకుంటారు.. అయితే ఆయ‌న‌క‌న్నా సీనియ‌ర్లు కూడా ఉన్నారు అనే విష‌యం మ‌రిచిపోతారు.. బాబు కంటే సీనియ‌ర్లు బాబు రాజ‌కీయాల పై చందమామ క‌థల్లా చెబుతారు.
 
బాబు రాజ‌కీయ స్వరూపాన్ని, రాజ‌కీయ విధానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రిస్తారు... అయితే గతంలో బాబు ఎటువంంటి రాజ‌కీయం చేశారు, వెన్నుపోటు ... వైశ్రాయ్ అన్ని విష‌యాలు నాడు నాయ‌కులు వ‌ల్లె వేస్తూనే ఉంటారు.. చంద్ర‌బాబు నాయుడు మంత్రిగా సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్న కాంగ్రెస్ నాయ‌కుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు, తాజాగా బాబు రాజ‌కీయాల పై విరుచుకుప‌డుతున్నారు.
 
బాబు లీకుల డ్రామాని ఢిల్లీలో వివ‌రించారు కేవీపీ.. చంద్ర‌బాబు రాజ‌కీయాలు మొద‌లుపెట్టిన స‌మ‌యం నుంచి లీకులు టెండ‌ర్లు చేయ‌డం అల‌వాటే అని విమ‌ర్శించారు కేవీపీ... బ‌డ్జెట్ లో ఏపీకీ అన్యాయం జ‌రిగింద‌ని కేటాయింపులు లేవ‌ని అంద‌రికి తెలుస‌ని, ఇప్పుడు ఏపీలో పార్టీ త‌ర‌పున చంద్ర‌బాబు అన్యాయం జ‌రిగింది అని హాడావుడి చేయ‌డం ఏమిట‌ని అన్నారాయ‌న‌.
 
ఇదంతా కేవ‌లం టెండ‌ర్లు ద‌క్కించుకోవ‌డానికి బాబు ఆడుతున్న డ్రామా అని కేవీపీ మండిప‌డ్డారు. ఎన్టీఆర్ నాడు ప‌ద‌వి నుంచి దిగిపోయిన స‌మ‌యం నుంచి, బాబు ఇలాంటి లీకుల డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏదో విధంగా లీకులు ఇచ్చి ఎదుటివాళ్ల‌ని  భ‌య‌పెట్ట‌డం బాబు నైజం అని అలా కుద‌ర‌క‌పోతే కాళ్ల బేరానికి వెళ్లే వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఆయ‌న బాబు లీకుల స్టోరీని బ‌య‌ట‌పెట్టారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.