పశ్చిమ గోదావ‌రిలో బొత్స , కిర‌ణ్ కుమార్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 11:47:27

పశ్చిమ గోదావ‌రిలో బొత్స , కిర‌ణ్ కుమార్ రెడ్డి

ప‌శ్చిమ గోదావ‌రిలో బొత్స స‌త్య‌నారాయ‌ణ, కిర‌ణ్ కుమార్ రెడ్డి ఏంటి అని అనుకుంటున్నారా.....పొలిటిక‌ల్ కి సంబంధించిన వార్త  మాత్రం కాదండోయ్....ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌ని తీరుకు నిద‌ర్శనగా బొత్స‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి విష‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను  తెలిపేందుకు రాసిన వార్త‌. 
 
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గం అని, అదేవిధంగా వైసీపీ సీనియ‌ర్ నేత,మాజీ మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌న‌గ‌రం జిల్లా కు చెందిన వారని అంద‌రికీ తెలుసు.
 
kiran kumar reddy votes removed 
 
అయితే వీరిద్ద‌రికి ఓటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మార్టేరులో ప్ర‌త్య‌క్షం కావ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం నాడు  నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవ‌ల గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి అంబంటి రాంబాబు ఆయన భార్య, ఇద్దరి కుమార్తెల ఓటును జాబితా నుంచి తొల‌గించార‌న్న విష‌యం తెలిసిందే. ఇదండి...!! మ‌న ప్ర‌భుత్వ అధికారుల ప‌ని తీరు. మొత్తానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట‌ర్ల తొల‌గింపే  ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.