వైసీపీలోకి మ‌ళ్లీ రీ ఎంట్రీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 03:12:02

వైసీపీలోకి మ‌ళ్లీ రీ ఎంట్రీ ?

ఉత్త‌రాంధ్రాలో పార్టీ ఎదుగుద‌ల కోసం తెలుగుదేశం వైసీపీ కృషి చేస్తున్నాయి.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ పార్టీల్లో ఉన్న ప‌లువురు నాయ‌కులు కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా ఇక్క‌డ ఒక్కొక్క‌రుగా తెలుగుదేశం, వైసీపీలోకి చేర‌డానికి రెడీ అవుతున్నారు.. మాజీ కేంద్ర‌మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల చూపు ఇరు పార్టీల‌పై ఉంది.

ఇక ఉత్త‌రాంధ్రాలో వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉండేవారు మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌, కొన్నికార‌ణాల వల్ల ఆయ‌న పార్టీ వీడారు... తిరిగి ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు జిల్లా నాయ‌కులు. ఇటీవ‌ల ఆయ‌న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని క‌ల‌వ‌డం కూడా ఇక్క‌డ ఉత్త‌రాంధ్రాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. అలాగే ఆయ‌న ఉత్త‌రాంధ్రాకు జ‌రుగుతున్న అన్యాయం పై ప్ర‌శ్నిస్తున్నారు.. కేంద్రం ఏపీని మోసం చేసింద‌ని, అలాగే ఉత్త‌రాంధ్రా ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచింది అని ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారు.

త‌మ ప్రాంతానికి రైల్వేజోన్ కూడా ఇవ్వ‌డానికి కేంద్రం సుముఖ‌త చూప‌డంలేద‌ని, కొణ‌తాల రామ‌కృష్ణ అన్నారు. దీనికి వ్య‌తిరేకంగా విన్నూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈరోజు ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 48 గంటల పాటు కొణతాల రామకృష్ణ నిరసనను తెలియజేయనున్నారు. విశాఖకు రైల్వే జోన్ తో సహా కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను ఈ బడ్జెట్ లో చేర్చాలన్నది కొణతాల రామకృష్ణ ప్రధాన డిమాండ్... 48 గంట‌ల‌పాటు ఆయ‌న రైలులో దీక్ష చేయ‌నున్నారు. మొత్తానికి కొణ‌తాల రాజకీయంగా మ‌రింత యాక్టీవ్ అవుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న రీఎంట్రీ ఇచ్చినా వైసీపీ ఆయ‌న‌కు వెల్ కం చెబుతుంది అంటున్నారు సీనియర్లు.. ఇటు తెలుగుదేశంలోకి ఆయ‌న వ‌చ్చే అవ‌కాశం లేదు అనేది జిల్లా త‌మ్ముళ్ల అభిప్రాయం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.