బాబుపై కేవిపీ ఘాటు లేఖ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 06:06:52

బాబుపై కేవిపీ ఘాటు లేఖ

కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర రావు,  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఘాటు లేఖ రాశారు. ఆయ‌న తీరు రాష్ట్రానికి శాపంగా మారింద‌ని, టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు కావ‌స్తున్నా... విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేయించుకోలేక‌పోయార‌ని ఆయ‌న లేఖ‌లో మండిప‌డ్డారు. 
 
ప్రాజెక్టులు ఆల‌స్యానికి కార‌ణం టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య దోపిడీ వాటాలు కుద‌ర‌కనే  అని ఆయ‌న ఆరోపించారు. అమ‌రావ‌తి లో శాశ్వ‌త భ‌వ‌నాల కోసం క‌నీసం ఇటుక  కూడా పేర్చ‌లేద‌ని కేవీపి అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న   హామీల‌పై వెంట‌నే అఖిల‌పక్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కోరారు. 
 
 
చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో విభేదించ‌డం  విడ్డూరంగా ఉంద‌ని, కేవ‌లం హెరిటేజ్, బిగ్ బ‌జార్ ప్ర‌యోజ‌నాల కోసం   రాజీ ప‌డుతున్నార‌ని   కేవీపీ అన్నారు. విభ‌జ‌న‌కు కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే కార‌ణం కాద‌ని, తెలుగుదేశం పార్టీ కూడా రెండు సార్లు విభ‌జ‌న కోసం లేఖ‌లు ఇచ్చింద‌ని గుర్తుచేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.