సూటిగా ప్ర‌శ్నించిన విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 10:21:36

సూటిగా ప్ర‌శ్నించిన విజ‌య‌సాయిరెడ్డి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదం ఒక‌టే అని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్నారు వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. గ‌తంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని, దానికి స‌పోర్ట్ చేసిన బీజేపీ నేడు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో నెర‌వేర్చాల‌ని, ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ఎటువంటి డైల‌మాలో ఉంచ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి విజయసాయిరెడ్డి హాజ‌ర‌య్యారు.... రైతులు పండించిన‌‌‌ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశామన్నారు.. కేంద్రం దీనిపై మ‌రోసారి పునరాలోచ‌న‌ల చేయాలి అని అన్నారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

రైల్వేజోన్ విషయంలో జాప్యం తగదని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని వాగ్దానాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కోరినట్టు తెలిపారు. తాము ఈ స‌మావేశంలో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు అన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నోట్ చేసుకున్నారని, ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.