ప‌వ‌న్ పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్ లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 03:47:13

ప‌వ‌న్ పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్ లు

జ‌న‌సేన పార్టీ అధినేత న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కొంత కాలంగా రాజ‌కీయ నాయ‌కులు, చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన  కొంతమంది వ్య‌క్తులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ప‌వ‌న్ సినిమాల‌కు  దూరంగా ఉంటాన‌ని చెప్పారు.. అలాగే ఇక‌పై  పూర్తి స్ధాయి  రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ యాత్ర మొద‌లు పెట్టారు దీనిపై తాజాగా ఏపీ  మంత్రి తెలుగుదేశం సీనియ‌ర్ నాయ‌కుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగు దేశం పార్టీ ఉంటే చాల‌ని, మ‌రే ఇత‌ర రాజ‌కీయ పార్టీలు అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను విమ‌ర్శించారు... 2019 ఎన్నిక‌ల త‌ర్వాత తెలుగు దేశం పార్టీ త‌ప్ప మ‌రే పార్టీ రాష్ట్రంలో ఉండ‌ద‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
 
అయితే ఒక వేళ‌ వ‌చ్చినా ఆ పార్టీని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తార‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.... అయితే ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌లు అచ్చెన్నాయుడు ప‌వ‌న్ పై చేశార‌ని సోష‌ల్ మీడియాలో కూడా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.