లోకేష్ కు రెండు ఆఫ‌ర్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 12:05:32

లోకేష్ కు రెండు ఆఫ‌ర్లు

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు ఐటీ- పంచాయ‌తీరాజ్ శాఖ‌ల మంత్రి లోకేశ్ ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతూ మంత్రిగా ఉన్నారు.. అలాగే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు అని ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.. అయితే కృష్ణా జిల్లాలో గుడివాడ లేదా హిందూపురం నుంచి లోకేశ్ పోటీ చేస్తారు అని తెలుగుదేశం నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.
 
తాజాగా ఆయ‌నకు ఇద్ద‌రు మంత్రులు సీట్లు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది..పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డికి, శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌కు మధ్య ఇదే విషయం చర్చకు వచ్చింది. అమరనాథ్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ల‌మ‌నేరు  నుంచి లోకేశ్ కు అసెంబ్లీ సీటు కేటాయించాలి అని బాబుకు తెలిపార‌ట‌.. ఇక్క‌డ నుంచి లోకేశ్ ను పోటీకి దింపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పుంగ‌నూరు నుంచి పోటీకి  వెళ‌తాన‌ని చెప్పార‌ట‌... గ‌తంలో అమ‌ర్ నాథ్ రెడ్డి కూడా లోకేశ్ కోసం రాజీనామా చేస్తాను అని చెప్పారు.. అయితే లోకేశ్ దీనిపై వ‌ద్దు అని అన్నార‌ట.. దీంతో బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అని ప‌య్య‌వులు తెలిపార‌ట.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌ర్నాథ్ రెడ్డి ఫ్యామిలీ పుంగ‌నూరు నుంచి పోటీ చేయ‌డానికి ఆలోచిస్తున్నార‌ట‌.
 
ఇక అలాగే మ‌రో మంత్రి ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజ‌యం చెందుతుంది అనే బ్రాండ్ వేయించుకున్న మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా తాజాగా భీమీలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ప్పుకుంటున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. అయితే గంటా శ్రీనివాస‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి లోకేష్ ను పోటీ చేయించాలి అని అనుకుంటున్నారు.ఇటు బాబు  కుప్పం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు కాబ‌ట్టి?  లోకేశ్ బాబు ఉత్తరాంధ్రానుంచి పోటీ చేసి అక్క‌డ పార్టీకి మ‌రింత ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నార‌ట‌.  దీనిపై బాబు లోకేష్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.