మంత్రి దేవినేని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 11:16:51

మంత్రి దేవినేని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గతంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌సాయం దండ‌గ అని వ్యాఖ్యానించి రైత‌న్న‌ల ఆగ్ర‌హానికి గురైన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మంత్రి ఉమా కూడా అలాంటి వ్యాఖ్య‌లే చేశారు.

పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్‌ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్‌ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్‌ పంటకు అలవాటుపడ్డాం, రైతులు సుబాబుల్‌ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి అంటూ మంత్రి ఉమా చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు.

కృష్ణా జిల్లా నందిగామలో పోలీస్ స్టేష‌న్ భ‌వనం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ మంత్రి ఉమా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారాయి. రైతులు ప‌ట్ల టీడీపీ ప్ర‌భుత్వం ఎప్పుడూ చిన్న చూపు చూస్తోంద‌ని, ఏపీలో వ‌రి ప్ర‌ధాన‌మైన పంట.. ఏపీని ద‌క్షిణ భార‌త ధాన్యాగారంగా పిలుస్తారు, టీడీపీ నాయ‌కుల‌కు ఆ మాత్రం తెలియ‌దా అంటూ రైతు విభాగం నాయ‌కులు మంత్రి ఉమా పై మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.