బాబుకు ఏపీ మంత్రి కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 02:30:28

బాబుకు ఏపీ మంత్రి కౌంట‌ర్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్న త‌రుణం, దీంతో తెలుగుదేశం మాత్రం బీజేపీ స్టాండ్ ను అర్దం చేసుకోలేక‌పోతోంది.. కొద్ది రోజులుగా తెలుగుదేశం బీజేపీ నాయ‌కుల మ‌ధ్య వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే, తాజాగా సీఎం చంద్ర‌బాబు బీజేపీ నాయ‌కుల పై త‌న వెర్ష‌న్ ను చెప్పారు.

బీజేపీ త‌మ‌తో మిత్ర‌ధ‌ర్మం పాటించ‌క‌పోతే, విభేదిస్తే తాము దూరం అవుతామ‌ని, న‌మ‌స్కారం పెట్టి ప‌క్క‌కు వెళ‌తాం అని అన్నారు చంద్ర‌బాబు.. దీంతో పార్టీలో కాస్త అల‌జ‌డి రేగింది... బీజేపీ నాయ‌కులు త‌మ పై కౌంట‌ర్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారని, చంద్ర‌బాబు అన‌డం? త‌మ నాయ‌కుల‌ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నాం అని చెప్పడంతో, ఇప్పుడు రాజ‌కీయంగా బాబు వ్యాఖ్య‌లు మ‌రింత వైర‌ల్ అవుతున్నాయి.. అలాగే బీజేపీ నాయ‌కుల‌కు కాస్త ఘాటుగా త‌గిలాయి సీఎం వ్యాఖ్య‌లు... ఏపీ బీజేపీ నేత‌లు దీనిపై త‌మ వైఖ‌రిని చూపుతున్నారు.

తాజాగా మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు దీనిపై స్పందించారు. తాము కూడా మిత్రధర్మం పాటిస్తున్నామని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలను అదుపు చేస్తామని చెప్పారని, ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకుంటామని అన్నారు. మేం కూడా తమ పార్టీ నేతలను అదుపు చేస్తామని, ఇకపై ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.

అలా కాదని నాయ‌కులు కామెంట్లు చేస్తే ఎవ‌రూ బాధ్య‌త అనే విధంగా ఆయ‌న కామెంట్లు చేశారు. అయితే ఇప్ప‌టికే జిల్లా జెడ్పీ చైర్మ‌న్ బాపిరాజుతో ఆయ‌న కు విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి.. దీనిపై బాబు నుంచి కూడా ఎటువంటి స్పంద‌న లేదు.. అలాగే బాపిరాజుకు పార్టీ త‌ర‌పున ఎటువంటి ప్ర‌శ్న రాలేద‌ని మాణిక్యాల‌రావు ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే పార్టీ త‌ర‌పున సీనియ‌ర్ నాయ‌కులు బీజేపీ నాయ‌కుల పై ఎటువంటి కామెంట్లు చేసినా, ఊరుకునే ప్ర‌శ‌స్తే లేదు అంటున్నారు బీజేపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.