ఫిరాయింపు ఎమ్మెల్యేకు భ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 12:46:21

ఫిరాయింపు ఎమ్మెల్యేకు భ‌యం

తెలుగుదేశం ఇచ్చిన న‌గ‌దు ప‌ల్లాలు న‌చ్చి, వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కాస్త టెన్ష‌న్ పెరిగింది అంటున్నారు వైసీపీ నాయ‌కులు...రాయ‌ల‌సీమ నుంచి కోస్తాకుఎంట‌ర్ అయిన జ‌గ‌న్ పాద‌యాత్ర ఫిరాయింపుల‌కు కాక‌పుట్టిస్తోంది.. అస‌లే వ‌ర్గ‌పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌త‌మ‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర హీట్ పుట్టిస్తోంద‌ని నాయ‌కులు మ‌ద‌న‌ప‌డుతున్నారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో మెజార్టీ స్ధానాలు గెలుచుకుంది.. ఇక అదే రీతిన వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు గెలుచుకోవాలి అని అనుకుంటున్నారు.. అయితే తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌తీ జిల్లాలో ఫిరాయింపుల సెగ్మెంట్ల మీదుగా జ‌రుగుతుండ‌టంతో పాటు, ఆయా సెగ్మెంట్ల‌లో కొత్త కొత్త ప్ర‌క‌ట‌న‌ల‌తో ఫిరాయింపు నాయ‌కుల‌కు కాస్త టెన్ష‌న్ పుడుతోంది....ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ఇక్క‌డ ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకు టెన్ష‌న్ ప‌ట్టుకుంది.. ఇక ఆయ‌న పాద‌యాత్ర‌తో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటుపై గూడురు ఎమ్మెల్యే సునీల్ అక్క‌డ నాయ‌కుల‌పై మండిప‌డ్డారు.

గూడురు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు... అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఎమ్మెల్యే.. స్థానికులను బెదిరించడంతో వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.... దమ్ముంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్‌ విసిరారు.. మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ల‌డంతో సునీల్ కు ఇక్క‌డ వ‌ర్గ‌పోరుతో పాటు పార్టీలో పోరు పెరిగిపోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.